Ananya Panday: ‘‘విజయ్ దేవరకొండతో సినిమా చేయడం నచ్చలేదు’’

ABN , Publish Date - Feb 07 , 2025 | 09:01 AM

ఆమె యాక్టింగ్ కూడా అంతంత మాత్రమే. నెపోటిజం, బ్యాడ్ స్టోరీ సెలక్షన్స్‌తో ఇండియాలోనే ఎక్కువ ట్రోలింగ్‌కు గురైన హీరోయిన్‌లలో తాను ఒకరు. ఇప్పుడిప్పుడే కెరీర్ కాస్త గాడిలో పడినట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆమె నటుడు విజయ్ దేవరకొండ సినిమాపై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

Ananya Panday Was Reluctant to Act in 'Liger'

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్ 'లైగర్'. ఆ సినిమా ప్రస్తావన తీసుకురావడానికి కూడా అందులో నటించిన నటులు, టెక్నీషియన్స్ సాహసం చేయరు. భారతీయ సినిమా చరిత్రలో మోస్ట్ ట్రోలింగ్ కు గురైన సినిమా ఇది. కాగా ఈ సినిమాతో బాలీవుడ్ యాక్ట్రెస్ అనన్య పాండే తెలుగులో డెబ్యూ చేసింది. ఇది ఆమె ఫస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్. ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్, అనన్యల మధ్య కెమిస్ట్రీ చూసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా షాక్ అయ్యింది. కానీ.. ఈ సినిమా గురించి ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇంతకు ఏం జరిగిందంటే..


అనన్య పాండే నెపో బేబీ అని ఇండస్ట్రీలోకి రాగానే చాలా విమర్శలను ఎదురుకుంది. కెరీర్ ఆరంభంలో ఆమె స్టోరీ సెలెక్షన్ బెడిసికొట్టడంతో సినీ అభిమానులు రెచ్చిపోయి మరి ట్రోలింగ్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. లైగర్ మరో ఎత్తు.. భారీ అంచనాల మధ్య పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఈ సినిమాకు కరణ్ జోహార్, ఛార్మి నిర్మాతలుగా వ్యవహరించారు. హాలీవుడ్ తోప్ మైక్ టైసన్ నటించాడు. కానీ.. కథ, కథనం, నటన అన్ని తేలిపోయాయి. దీంతో సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.


తాజాగా అనన్య పాండే తండ్రి, బాలీవుడ్ నటుడు చంకీ పాండే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''అనన్యకు ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు అసౌకర్యంగా ఫీలైంది. ఆ పాత్రకు తాను సెట్‌ కానని, చిన్న పిల్లలా కనిపిస్తానని భావించింది. కన్ఫ్యూజన్ లో ఉండిపోయింది. నా దగ్గరకు వచ్చి 'పాపా.. ఈ పాత్ర చేయడానికి నేను చాలా చిన్నదాన్ని' అని అంది. కానీ ఈ సినిమా చేయమని నేను చెప్పాను. ఇది పెద్ద కమర్షియల్ సినిమా అని, సక్సెస్‌ అయితే మంచి పేరొస్తుందని ఒప్పించాను'' అని అన్నారు. అంతకు ముందు ఓ షోలో అనన్య కూడా మాట్లాడుతూ.. పేరెంట్స్ చెప్పడంతోనే ఈ సినిమా చేశాను అంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ఫ్లాప్ కావడంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. హిట్ అయ్యుంటే వేరేలా చెప్పుకునేవారని అభిప్రాయాలని వ్యక్తపరుస్తున్నారు. కాగా అనన్య పాండే ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో కంట్రోల్(Ctrl) అనే అద్భుతమైన సినిమాతో ముందుకు వచ్చింది. దీనికి విమర్శకుల నుండి ప్రశంసల జల్లు కురిసింది.

Also Read-Sonu Sood: ‘‘సోనూ సూద్‌‌ను అరెస్ట్ చేయండి’’

Also Read-Thandel 'X' Review: నాగ చైతన్య 'తండేల్'పై ఆడియెన్స్ ఒపీనియన్ ఇదే..

Also Read- Madhavan: కొంపముంచిన ఏఐ.. మాధవన్‌కు అనుష్క కాల్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 07 , 2025 | 09:05 AM