Amitabh Bachchan: విలాసవంతమైన డ్యూప్లెక్స్ అమ్మేశారు..
ABN , Publish Date - Jan 21 , 2025 | 02:13 PM
బిగ్‌బీ ఈ ఇంటిని ఏప్రిల్ 2021లో రూ. 31 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ నెల 17న విక్రయించారు. 5 వేల చదరపు విస్తీర్ణంలో ఉన్నఈ అపార్ట్‌మెంట్‌లో దాదాపు ఆరు కార్లు పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంది
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) విలాసవంతమైన డ్యూప్లెక్స్ ప్లాట్‌ను అమ్మేశారు. ముంబయిలోని అంధేకి ప్రాంతంలో ఉన్న ఖరీదైన ఫ్లాట్‌ను (Amitabh Bachchan Costly Flot Sell) విక్రయించారు. దాని విలువ దాదాపు రూ.83 కోట్లు ఉంటుందని సమాచారం. బిగ్‌బీ ఈ ఇంటిని ఏప్రిల్ 2021లో రూ. 31 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ నెల 17న విక్రయించారు. 5 వేల చదరపు విస్తీర్ణంలో ఉన్నఈ అపార్ట్‌మెంట్‌లో దాదాపు ఆరు కార్లు పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంది. ఈ లగ్జరీ ఫ్లాట్‌ను విజయ్ సింగ్ ఠాకూర్, కమల్ విజయ్ ఠాకూర్ కొనుగోలు చేశారు. బచ్చన్ ఈ ఇల్లు కోనుగోలు చేసినప్పటికీ ఇప్పటికీ 168 శాతం వాల్యూ పెరిగిందని చెబుతున్నారు. ఈ బిల్డింగ్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీకి రూ.4.98 కోట్లు, రిజిస్ట్రేషన్ ఫీ రూ.30000 అయిందని తెలిసింది. నవంబర్, 2021లో బచ్చన్ ఈ ఇంటిని హీరోయిన్ క్రితీసనన్‌కు నెలకు 10 లక్షల రెంట్ సెక్యూరిటీ డిపాజిట్ రూ. 60 లక్షలతో అద్దెకు ఇచ్చారు.
అమితాబ్ బచ్చన్ కుటుంబం గత నాలుగేళ్లలో రియల్ ఎేస్టట్‌లో దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టారు. గతంలో అభిషేక్ బచ్చన్ ముంబయిలో ఒకే అంతస్తులో నాలుగు పెద్ద ఫ్లాట్‌లను కొనుగోలు చేశారు. ముఖ్యంగా గతేడాదిలోనే రూ. రియల్ ఎేస్టట్‌లో 100 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఇక సినిమాల విషయానికొేస్త అమితాబ్ బచ్చన్ గతేడాది ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రంలో కనిపించారు. కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షోకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.