Allu Aravind: ఆ స్టార్ హీరోతో సినిమా చేయలని ఉంది..
ABN , Publish Date - Jan 31 , 2025 | 08:44 PM
Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అందుకొని రికార్డులు లేవు. కానీ.. పాన్ ఇండియన్ సినిమాల హవా పెరిగాక ఆయన రికార్డులన్ని కాస్త పాతవి అయిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తన మనసులోని మాటను బయట పెట్టారు.
టాలీవుడ్ లో అగ్ర నిర్మాతలలో ఎప్పటికి వినిపించే పేరు అల్లు అరవింద్. కేవలం డబ్బులున్న నిర్మాతగానే కాకుండా మంచి టాలెంట్ తో మంచి ప్రాజెక్టులు చేస్తూ దేశంలోనే టాప్ ప్రొడ్యూసర్ లలో ఒకడిగా ఎదిగాడు. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలలోను ఆయన భారీ చిత్రాల నిర్మాణంలో పాలు పంచుకున్నాడు. తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. తన మనసులోని ఓ కోరికను పంచుకున్నాడు. ఆ కోరిక కొంచెం ఎక్స్‌పెన్సివ్ కోరికే. ఇంతకీ ఆ కోరిక ఏంటంటే..
ప్రస్తుతం అల్లు అరవింద్ నాగచైతన్య 'తండేల్' సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రమోషన్స్ బాధ్యతలను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా అల్లు అర్జున్ ని పిలిచేందుకు ప్లాన్ చేయగా, ఇతర భాషల్లో ట్రైలర్ విడుదల చేసేందుకు స్టార్ హీరోలను సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చెన్నైలో హీరో కార్తీతో, ముంబైలో హీరో అమీర్ ఖాన్ తో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లు నిర్వహించారు. శుక్రవారం ముంబైలో జరిగిన ఈవెంట్ లో అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Also Read-Salman Khan: సౌత్ భామపై సల్మాన్ కన్ను..
గతంలో అల్లు అరవింద్.. అమీర్ ఖాన్ తో 'గజిని' సినిమా నిర్మించి ఎంత పెద్ద సక్సెస్ అందుకున్నాడో తెలిసిన విషయమే. ఈ సినిమా భారతీయ చలన చిత్ర పరిశ్రమ చరిత్రలో బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు కొల్లగొట్టిన తొలి సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. కాగా , తాజాగా ముంబైలో జరిగిన ఈవెంట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. "అప్పట్లో గజిని రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే అమీర్ ఖాన్ మాతో ఛాలెంజ్ చేశారు. కచ్చితంగా వందకోట్లు రాబడుతుందని అన్నారు.. అందుకే మేం ప్రమోట్ చేశాం. అప్పుడు రూ.100 కోట్లు ఎక్కువ.. ఇప్పుడైతే రూ.1000 కోట్లు రాబట్టే సినిమా తీయాలని ఉంది. అది గజిని-2 కూడా కావొచ్చని" నవ్వుతు తన మనసులోని మాటను బయటపెట్టారు.