Alia Bhatt: జెన్నిఫర్ లోపెజ్‌లాంటి వారిని పక్కనపెట్టి.. అలియా క్రేజే వేరు
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:43 PM
జెన్నిఫర్ లోపెజ్ వంటి అంతర్జాతీయ నాయికలను వెనక్కినెట్టి అలియా టాప్‌లో ఉండడం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ సందర్భంగా అభిమానులు ఆమెను విష్ చేస్తున్నారు.
బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అలియాభట్‌కు (Alia bhatt) మరో ఘనత సాధించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిభావంతమైన హీరోయిన్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఇన్‌ఫ్లుయెన్సర్ ((influential actress)మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ హైప్ ఆడిటర్ తాజాగా విడుదల చేసిన నివేదికలో అలియా సెకెండ్ ఫ్లేస్ సొంతం చేసుకుంది. జెన్నిఫర్ లోపెజ్ వంటి అంతర్జాతీయ నాయికలను వెనక్కినెట్టి అలియా టాప్‌లో ఉండడం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ సందర్భంగా అభిమానులు ఆమెను విష్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అలియాకు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే! ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 8 కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఎప్పుడూ తన సినిమా, వ్యక్తిగత విశేషాలను అలియా ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు. ఫొటోషూట్‌లతో ఆకట్టుకుంటారు. (world’s 2nd most influential actor)
గతేడాది కూడా టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ‘100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’ జాబితాలోనూ చోటు దక్కించుకుంది (Alia Bhatt international Craze) అలియా. గత ఏడాది ఆమె ‘జిగ్రా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం మిశ్రమ ఫలితాలకు పరిమితమైంది. తాజాగా అలియాకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రభాస్, హనురాఘవపూడి కాంబినేషన్‌లో రానున్న ఫౌజీ సినిమాలో అలియా యువరాణి పాత్రలో కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. నాగ్ అశ్విన్ సినిమాలోనూ ఆమె నటించనున్నట్లు వారలు వస్తున్నాయి. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉంది అనేది అధికారిక ప్రకటన వస్తే తప్ప తెలియదు.