Kesari Chapter 2: కాపీ కొట్టారనే ఆరోపణలతో రచ్చ మొదలైంది..
ABN , Publish Date - Apr 28 , 2025 | 03:38 PM
బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కేసరి చాప్టర్ 2’. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకువచ్చింది.
బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ (Akshay kumar) కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కేసరి చాప్టర్ 2’ (Kesari Chapter 2). కరణ్ సింగ్ త్యాగి (karan Singh Tyagi) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకువచ్చింది. ప్రేక్షకుల ఆదరణతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ సినిమాలోని డైలాగులపై యూట్యూబర్ యాహ్యా బూట్‌వాలా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై చిత్ర నిర్మాతలు తనతో మాట్లాడినట్లు యూట్యూబర్ వెల్లడించారు. ‘‘కేసరి చాప్టర్ 2’ చిత్ర నిర్మాతలు నాతో చర్చించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నాం. ఈ విషయంలో మీ అందరి మద్దతు మర్చిపోలేను. మీ వల్లే ఇది సాధ్యమైంది’’ అని పోస్ట్ పెట్టారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అనన్య పాండేలకు మధ్య జరిగే సంభాషణల్లో తన కవితను ఉపయోగించారని యాహ్యా బూట్‌వాలా ఆరోపించారు.
జలియన్ వాలాబాగ్ మారణకాండపై తాను గతంలో రాసుకున్న కవితలోని కొన్ని లైన్లను తన అనుమతి లేకుండా కాపీ కొట్టారని అతను ఆరోపణలు చేశారు. ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని కోరుతూ పోస్ట్ పెట్టారు. దానికి చిత్ర బృందాన్ని ట్యాగ్ చేశారు. గతంలో రాసిన కవితను, ‘కేసరి 2’ డైలాగును పోలుస్తూ వీడియో విడుదల చేయగా. ఇది చర్చనీయాంశమైంది. దీనిపై చిత్రబృందం స్పందించడంతో ఇష్యూకి ఫుల్‌స్టాప్ పడినట్లైంది.