Aaradhya Bachchan: ఆ కథనాలపై మరోసారి కోర్టుకెక్కిన ఐశ్వర్య రాయ్, అభిషేక్‌ల కుమార్తె..
ABN , Publish Date - Feb 04 , 2025 | 07:35 PM
ఈ మధ్య తరచూ ఐశ్వర్య, అభిషేక్‌లు విడిపోయారంటూ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో వారి కుమార్తె ఆరాధ్య బచ్చన్ కోర్టును ఆశ్రయించడం విశిష్టతను సంతరించుకుంది. ఇంతకీ ఆరాధ్య బచ్చన్ ఎందుకు కోర్టును ఆశ్రయించింది? అసలు విషయం ఏమిటనే వివరాల్లోకి వెళితే..
ఈ మధ్య కాలంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ వార్తలలో ఎలా వైరల్ అవుతుందో తెలియని విషయం కాదు. బిగ్ బి కొడుకు, కోడలు విడిపోతున్నారని, వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయనేలా వార్తలు రావడం, ఆ వార్తలను ఐశ్వర్య రాయ్‌తో పాటు అభిషేక్ బచ్చన్ కండిస్తూ ఉండటం రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంది. కొన్ని రోజులుగా ఈ వార్తలకు కాస్త బ్రేక్ పడినా.. ఇప్పుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ రూపంలో మరోసారి బిగ్ బి ఫ్యామిలీ వార్తలలో హైలెట్ అవుతోంది. బిగ్ బి మనవరాలు ఆరాధ్య బచ్చన్ మరోసారి దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అసలు విషయం ఏమిటంటే..
Also Read- Jr NTR: అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ రిక్వెస్ట్..
2023లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆరాధ్య బచ్చన్‌పై, ఆమె ఆరోగ్యంపై లేనిపోని కథనాలను ప్రచురించారు. ‘ఆరాధ్య ఇక లేరు’ అనేలా యూట్యూబ్ ఛానళ్ల ప్రచారం చేశాయి. అలాగే బచ్చన్ ఫ్యామిలీ ఫొటోలను మార్ఫింగ్ చేసి.. విడుదల చేసిన వీడియోలపై బచ్చన్ ఫ్యామిలీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, బచ్చన్ ఫ్యామిలీ సదురు ఛానళ్లపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సి. హరి శంకర్.. వెంటనే ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యానికి సంబంధించి ప్రచారం చేసిన వీడియోలను తొలగించాలని ఆదేశించారు. కోర్టు తీర్పునిచ్చినా.. ఇంకా కొన్ని వీడియోలు దర్శనమిస్తుండటంతో.. మరోసారి ఆరాధ్య బచ్చన్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా ఇంకా కొన్ని యూట్యూబ్ చానళ్లు, వెబ్‌సైట్స్.. ఆరాధ్య ఆరోగ్యంపై ప్రచురించిన తప్పుడు కథనాలను అలాగే ఉంచడంపై.. సదరు ఛానళ్లతో పాటు గూగుల్‌పై కూడా కోర్టు సీరియస్ అయ్యింది. గతంలో కోర్టు చెప్పినా ఇంకా అలాంటి వార్తలను తీసివేయలేదని, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్న ఆరాధ్యకు కోర్టు అండగా నిలుస్తూ.. గూగుల్‌కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను మార్చి 17న మరోసారి విచారణ జరపనున్నట్లుగా న్యాయస్థానం ప్రకటించింది.