Aamir Khan: కేవ్‌మాన్‌ లుక్‌లో ఆమిర్‌.. వైరల్‌ అవుతున్న ఫొటోలు

ABN , Publish Date - Jan 30 , 2025 | 03:29 PM

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌ ప్రస్తుతం ఓ మేకోవర్‌ కోసం ఆయన అంకితభావంతో పని చేస్తున్నారు. కేవ్‌మాన్‌గా రెడీ అయ్యి సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.


బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) ఓ క్యారెక్టర్‌ కోసం ఎంతగా కృషి చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ పాత్ర మేకోవర్‌ కోసం ప్రాణం పెట్టేస్తారు. అందుకు ఆయన పోషించిన చాలా పాత్రలే ఉదాహరణ. ప్రస్తుతం ఓ మేకోవర్‌ కోసం ఆయన అంకితభావంతో పని చేస్తున్నారు. కేవ్‌మాన్‌గా (Cave Man look) రెడీ అయ్యి సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కేవ్‌ మాన్‌ మేకోవర్‌లో ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ మేకోవర్‌ కోసం ఆమిర్‌ఖాన్‌ (Aamir New makover) పాతకాలం నాటి  చిరిఘిన బట్టలు, చెదిరిన గడ్డం, చింపిరి జుట్టు మరియు మందపాటి కనుబొమ్మలతో కనిపించారు. మేకోవర్‌ వీడియో వైరల్‌ అయిన తర్వాత, ముంబై వీధుల్లో ఒక వ్యక్తి కేవ్‌ మాన్‌ వేషంలో తిరుగుతున్నట్లు చూపించిన మరో వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. 


ఇదంతా ఆమిర్‌ తదుపరి సినిమా కోసం చేస్తున్నాడా లేక ఇంకేదైనా ప్రమోషన్‌ కోసమా అని బాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. గతంలోలా కొడుకు జునైద్‌ సినిమా ప్రమోషన్స్‌లో ఇదొక  భాగమా అని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా ఓ సాఫ్ట్‌ డ్రింక్‌ కోసం జరుగుతోన్న క్యాంపెనింగ్‌ అని మరో మాట వినిపిస్తుంది. కేవ్‌మాన్‌ లుక్‌లో ఆమిర్‌ను  గుర్తు పట్టలేకుండా ఉన్నారు. అంతగా ఆయన డెడికేషన్‌ ఉంటుందని అభిమానులు చెప్పుకుంటున్నారు.  ప్రస్తుతం ఆమిర్ 'సితారే జమీన్ పర్' , కూలీ, లాహోర్ 1947 చిత్రాలతో బిజీగా ఉన్నారు.

READ MORE: Sai Durga Tej: మీ సాయం ఓ పాపకు బతుకునిస్తుంది..

Updated Date - Jan 30 , 2025 | 03:31 PM