Gajini 2: 'గజిని 2' మురుగదాస్‌ ఆలోచన ఎలా ఉందంటే... 

ABN , Publish Date - Mar 24 , 2025 | 04:16 PM

తమిళంలో ఎ.ఆర్‌.మురుగదాస్‌ (Murugadoss) దర్శకత్వం వహించిన ‘గజిని’ (Gajini) సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అదే సినిమా తెలుగులో అనువదిస్తే అదీ సూపర్‌ హిట్‌.

తమిళంలో ఎ.ఆర్‌.మురుగదాస్‌ (Murugadoss) దర్శకత్వం వహించిన ‘గజిని’ (Gajini) సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అదే సినిమా తెలుగులో అనువదిస్తే అదీ సూపర్‌ హిట్‌. అదే పేరుతో ఆమిర్‌ ఖాన్‌తో(Aamir Khan) హిందీలో రీమేక్‌ చేస్తే  అదీ సంచలన విజయం సాధించింది. అందుకే ఈ చిత్రం మురుగదాస్‌ కెరీర్‌లో ప్రత్యేకమని చెబుతుంటారు. ఇప్పటికీ ఆ సినిమా గురించి సినీ ప్రేమికులు మాట్లాడకుంటున్నారంటే ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్‌ అయిందో అర్థమవుతోంది. అయితే దీనికి సీక్వెల్‌గా ‘గజిని 2’ చేయాలని అభిమానులు కోరుకుంటున్న మాట నిజం.

అయితే దీనిపై దర్శకుడు మురుగదాస్‌ తాజాగా మాట్లాడారు. ‘సికిందర్‌’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ ‘గజిని 2’ రూపొందించే అవకాశం ఉంది. నా మైండ్‌లో ఓ ఆలోచన ఉంది. మేము కూర్చుని దాని గురించి డిస్కస్‌ చేయాలి. అంతా సవ్యంగా జరిగితే, మేము సీక్వెల్‌ చేయగలము. నాకు ఒక బేసిక్‌ ఐడియా ఉంది. కానీ ఫుల్‌ స్క్రిప్ట్ రెడీ చేయాలి. అంతా అనుకున్నట్లు జరిగితే ఆ సినిమాను తమిళం, హిందీ రెండింటిలోనూ ఏకకాలంలో చేస్తా. ఈ చిత్రం విడుదలై 16 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు అంటే ఒక రచయితగా దర్శకుడిగా నేను ఆ సినిమాను బాగా తీశానని భావిస్తాను’’ అని అన్నారు.




హిందీ ‘గజిని’లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమీర్‌ ఖాన్‌, అసిన్‌, జియా ఖాన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి సీక్వెల్‌ తీస్తే బాగుంటుందని అల్లు అరవింద్‌ చాలాకాలంగా అంటున్నారు. ఇటీవల ‘తండేల్‌’ హిందీ ఈవెంట్‌లో అమీర్‌ ఖాన్‌ ముందే ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘గజిని’తో 100 కోట్ల క్లబ్‌ని ఓపెన్‌ చేసినట్లే, ‘గజిని 2’తో 2 వేల కోట్ల కలెక్షన్స్‌ రాబడదామని అన్నారు. ఆమీర్‌ సైతం దీనికి పాజిటివ్‌గా స్పందించారు. ఎవరైనా స్ర్కిప్ట్‌ రెడీ చేేస్త నటించడానికి తాను సిద్థమే అని పలు సందర్భాల్లో  ఆమిర్‌ చెప్పారు. మరోవైపు ‘కంగువ’ ప్రమోషన్స్‌లో సూర్య ‘గజిని 2’ గురించి మాట్లాడారు. ఫ్యూచర్‌లో గజినీకి సీక్వెల్‌ ఉంటుందని, తనను అమీర్‌ ఖాన్‌ను ఒకేసారి బిగ్‌ స్క్రీన్  మీదే చూసే అవకాశం ఉంటుందని హింట్‌ ఇచ్చారు. ఇప్పుడు మురగదాస్‌ మాటల్ని బట్టి తప్పకుండా గజిని2 ఉంటుందనే అర్థమవుతోంది.

Updated Date - Mar 24 , 2025 | 04:18 PM