Year Ender 2024: ఈ ఏడాది నెటిజన్లు వెతికింది ఈ సినిమాల కోసమే..
ABN , Publish Date - Dec 21 , 2024 | 04:33 PM
Rewind 2024: కలెక్షన్స్, హీరోలు, భాషలు సంబంధం లేకుండా అందరి అటెన్షన్ గ్రాబ్ చేసి ఆడియెన్స్‌తో గూగుల్‌లో ఎక్కువగా శోధించబడిన టాప్ 10 చిత్రాలు ఇవే ..
2024 మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ ఏడాది భారతీయ సినిమా ఇండస్ట్రీకి ఎత్తు, పల్లాలను సమానంగా ఇచ్చింది. ఒకే భాషా డామినేషన్ లేకుండా అన్ని ఇండస్ట్రీల సినిమాలు పాన్ ఇండియన్ వైడ్ గా సూపర్ సక్సెస్ అందుకున్నాయి. అయితే కలెక్షన్స్, హీరోలు, భాషలు సంబంధం లేకుండా అందరి అటెన్షన్ గ్రాబ్ చేసి వాళ్ళతో గూగుల్ లో ఎక్కువగా శోధించబడిన టాప్ 10 చిత్రాలు ఇవే
స్త్రీ 2
శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా.. అమర్ కౌశిక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘స్త్రీ 2’. ఈ సినిమా ఆగస్ట్‌లో విడుదలై సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898AD’ చిత్రానికి పోటీగా కలెక్షన్స్ రాబట్టి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకనొక దశలో ‘కల్కి’ని మించేలా కలెక్షన్స్ రాబట్టినట్లుగా కూడా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ సినిమా 2024కి గాను ఇంటర్నెట్ లో అత్యధికంగా సెర్చ్ చేయబడ్డ మొదటి ఇండియన్ మూవీగా నిలిచింది.
కల్కి 2898 AD
ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమా కల్కి 2898 AD. ఈ సినిమా రూ. 1000 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసింది. ఓవరాల్ గా రూ. 1019.8 కోట్లను కొల్లగోట్టింది. ఈ సినిమా 2024కి గాను ఇంటర్నెట్ లో అత్యధికంగా సెర్చ్ చేయబడ్డ రెండవ ఇండియన్ మూవీగా నిలిచింది.
12th ఫెయిల్
విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్ మస్సే కీలక పాత్ర పోషించిన చిత్రం ‘12th ఫెయిల్’. చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్‌ను సొంతం చేసుకోవడంతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 2024కి గాను ఇంటర్నెట్ లో అత్యధికంగా సెర్చ్ చేయబడ్డ మూడవ ఇండియన్ మూవీగా నిలిచింది.
లాపతా లేడీస్
అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి అధికారికంగా ఎంపికై చివరి నిమిషంలో మాత్రం నిరాశపరిచింది. ఈ సినిమా 2024కి గాను ఇంటర్నెట్ లో అత్యధికంగా సెర్చ్ చేయబడ్డ నాలుగవ ఇండియన్ మూవీగా నిలిచింది.
హనుమాన్
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. సూపర్ హీరో కథకు ఇతిహాసాన్ని జోడించి తీసిన ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించగా.. అమృతాఅయ్యర్ కథానాయిక నటించారు. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించారు. రూ.40 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టించింది. ఈ సినిమా 2024కి గాను ఇంటర్నెట్ లో అత్యధికంగా సెర్చ్ చేయబడ్డ ఐదవ ఇండియన్ మూవీగా నిలిచింది.
మహారాజా
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన మాస్టర్ పీస్ ‘మహారాజా’. విజయ్ సేతుపతి 50వ సినిమాగా జూన్ 14న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి విమర్శకులు ప్రసంశలు అందుకొని మాస్టర్ పీస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా 2024కి గాను ఇంటర్నెట్ లో అత్యధికంగా సెర్చ్ చేయబడ్డ 6వ ఇండియన్ మూవీగా నిలిచింది.
మంజుమ్మెల్ బాయ్స్
మలయాళ చిత్రసీమలో సంచలనం సృష్టించిన చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ ఇటీవల విడుదలైన ఈ థ్రిల్లర్ అన్ని భాషల్లోను మంచి టాక్ తెచ్చుకుంది. సౌబిన్ షహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్‌భాసి, షా జార్జ్ మరియన్, లాల్ జూనియర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024కి గాను ఇంటర్నెట్ లో అత్యధికంగా సెర్చ్ చేయబడ్డ 7వ ఇండియన్ మూవీగా నిలిచింది.
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (Goat)
దళపతి విజయ్ నటించిన తమిళ చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ థర్డ్ ప్లేస్ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.456.6 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా 2024కి గాను ఇంటర్నెట్ లో అత్యధికంగా సెర్చ్ చేయబడ్డ 8వ ఇండియన్ మూవీగా నిలిచింది.
సలార్
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన ‘బాహుబలి’ సిరీస్ చిత్రాల తర్వాత.. ప్రభాస్ స్టామినా ఇది.. అని చెప్పే చిత్రం ఒక్కటీ బాక్సాఫీస్ దగ్గర పడలేదు. గతేడాది వచ్చిన ‘సలార్’ చిత్రం ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేస్తోంది. ఈ సినిమా 2024కి గాను ఇంటర్నెట్ లో అత్యధికంగా సెర్చ్ చేయబడ్డ 9వ ఇండియన్ మూవీగా నిలిచింది.
ఆవేశం
ఈ ఏడాది సమ్మర్ లో మళయాళం భాషలో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం అవేశం. ఫహాద్ ఫాజిల్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై కేరళలో రికార్డులు సృష్టించింది. రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ ఏడాది ప్రేమలు, మంజమ్మల్ బాయ్స్, ది గోట్ లైఫ్ సినిమాల తర్వాత రూ.100 కోట్ల మార్క్‌ను దాటిన చిత్రంగా పేరు తెచ్చుకుంది. అంతేగాక ఫహద్ కేరీర్‌లోనే ఈ ఘనత సాధించిన మొదటి చిత్రంగా అవేశం చరిత్ర సృష్టించింది. ఈ సినిమా 2024కి గాను ఇంటర్నెట్ లో అత్యధికంగా సెర్చ్ చేయబడ్డ 10వ ఇండియన్ మూవీగా నిలిచింది.