Year Ender 2024: కనిపించని స్టార్ హీరోయిన్స్..
ABN , Publish Date - Dec 24 , 2024 | 08:37 PM
Rewind 2024: అగ్రెసివ్‌గా కనిపించే స్టార్ హీరోయిన్లు కనిపించకపోవడంతో ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో జోరు కాస్త తగ్గింది. కొందరు అసలు బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు. మరికొందరు స్మాల్ స్క్రీన్ పై కనిపించిన మెప్పించలేకపోయారు.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మకుటం లేని మహారాణులుగా ఎదిగి, సినీ ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్లు కొందరు ఈ సారి ఒక్కటంటే ఒక్క మూవీలోను కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. కొందరు హీరోయిన్లు బిగ్ స్క్రీన్ పై కనిపించకపోయిన స్మాల్ స్క్రీన్ పై అలరించారు. ఆలస్యం చేయకుండా ఆ హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేదం..
సమంత
టాలీవుడ్ క్వీన్ సమంత ఈ ఏడాది ఒక్కటంటే ఒక మూవీలను కనిపించ లేదు. టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు ఆమె అన్ని సౌత్ ఇండస్ట్రీలలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆమె ఈ ఇయర్ ఎలాంటి మూవీ ప్రాజెక్స్ట్ ని కూడా స్టార్ట్ చేసినట్లు కనిపించలేదు. ఈ లెక్క ప్రకారం 2025లోను సమంత సిల్వర్ స్క్రీన్ పై కనబడటం కష్టమే. అయితే ప్రైమ్ వీడియోలో వచ్చిన 'సిటాడెల్ హనీ బన్నీ'లో ఆమె వరుణ్ ధావన్ తో కలిసి అల్ట్రా యాక్షన్ మోడ్ లో కనిపించారు. కేవలం ఒకే ఒక్క ఓటీటీ సిరీస్ తో బాలీవుడ్, హాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అది పెద్దగా ఆకట్టుకోకపోవడం కొసమెరుపు.
అనుష్క శెట్టి
అనుష్క శెట్టి టాలీవుడ్ మోస్ట్ లవ్‌డ్ హీరోయిన్. కొన్నేళ్లుగా భిన్న కథలు, భిన్న ఇండస్ట్రీలతో ప్రయోగాలు చేస్తున్న స్వీటీ ఈ ఏడాది ఒక్క మూవీలోను కనిపించలేదు. అయితే స్వీటీ బర్త్ డే సందర్భంగా ఘాటీ, కథనార్ టీజర్లని విడుదల చేశారు. ఈ టీజర్లకు విశేష స్పందన లభిస్తోంది. దీంతో స్వీటీ మెరుపులు 2025లో ఉంటాయని ఫ్యాన్స్ అడ్జెస్ట్ చేసుకుంటున్నారు.
త్రిష
త్రిష.. సౌతిండియాలోనే మోస్ట్ బ్యూటీ ఫుల్ సీనియర్ హీరోయిన్. తమిళ్, తెలుగు, మలయాళం ఇండస్ట్రీలలో నటిస్తూ ఇప్పటి జెనరేషన్ స్టార్ హీరోయిన్లకి అసూయ తెప్పిస్తుంది. ఈ ఏడాది ఆమె చిరు 'విశ్వంభర' సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై కనపడాల్సి ఉంది. కానీ.. తనయుడి 'గేమ్ ఛేంజర్' కోసం చిరు వెనక్కి తగ్గగా త్రిషకి మైనస్ అయ్యింది. అయితే త్రిష దళపతి విజయ్ సినిమా 'గోట్'లో ఓ సాంగ్‌కి స్టెప్పులేసింది. కానీ.. అది ఫుల్ లెంగ్త్ పాత్ర కాకపోవడంతో త్రిష అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
పూజా హెగ్డే
తన అందం, అభినయంతో తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన బ్యూటీ పూజ హెగ్డే. ఈ మధ్య కాలంలో ఆమె తెలుగు ఇండస్ట్రీకి దూరమై బాలీవుడ్, కోలీవుడ్ కి దగ్గరైంది. అయితే అక్కడ కూడా ఈ ఇయర్ ఆమె ఒక్క మూవీలోను కనిపించలేదు. 2024లో తనని మిస్ అయినా ఆడియెన్స్ కోసం ఆమె 2025లో బాలీవుడ్ మూవీ 'దేవా', కోలీవుడ్ మూవీ 'సూర్య 44'లతో ముందుకు రానుంది.
నయనతార
సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ 'నయనతార' ఈ సారి స్క్రీన్ పై కంటే వివాదాల్లోనే ఎక్కువగా కనిపించారు. ఈ అగ్రెసివ్ బ్యూటీ ఈ సారి ఒక్కసారి కూడా సిల్వర్ స్క్రీన్ పై కనిపించకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తన పెళ్లి డాక్యుమెంటరీ ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయ్యింది. ఆమె ‘మూక్కుత్తి అమ్మన్’ చిత్రం రెండో భాగంతో 2025లో రానున్నారు.