Yearender 2024: 2024 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న తారలు వీరే..

ABN , Publish Date - Dec 19 , 2024 | 11:22 PM

Rewind 2024: ఎంత స్టార్లు అయితే మాత్రం వారికి వయసు అయిపోతుంటుంది. జీవితంలో అనుభవించాల్సిన ముచ్చట్లు వారికీ ఉంటాయి. అలాంటి ముచ్చట్లలో పెళ్లి కూడా ఒకటి. 2024 సంవత్సరంలో సెలబ్రిటీలు చాలా మంది తమ బ్యాచ్‌లర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అలా 2024లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన సెలబ్రిటీలు ఎవరెవరంటే..

Celebrity Weddings 2024

ఎంత సెలబ్రిటీలు అయితే మాత్రం వారికి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. వారికి పెళ్లి, పిల్లలు కావాలని ఉంటుంది. కెరీర్ కోసం వయసు మీద పడుతున్నా.. పెళ్లి విషయం పక్కన పెట్టేసే వారికి ఏదో ఒక టైమ్‌లో పెళ్లిపై గాలి మళ్లుతుంది. అలా ఈ సంవత్సరం (2024) బ్యాచ్‌లర్ జీవితానికి ముగింపు నిచ్చి వివాహబంధంలోకి అడుగుపెట్టిన సెలబ్రిటీలు ఎవరంటే..

నాగచైతన్య-శోభిత

అక్కినేని నాగచైతన్య-శోభితలు రీసెంట్‌గా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ సెలబ్రిటీలే కావడం విశేషం. అక్కినేని ఫ్యామిలీ వీరి వివాహాన్ని రీసెంట్‌గా అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా నిర్వహించింది. సమంతాతో విడుదల అనంతరం చైతూ, శోభిత ప్రేమలో పడటం, వారిద్దరూ కొన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత ఇటీవలే పేరేంట్స్‌ని ఒప్పించి వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.


రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ

ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌ స్టేటస్‌ని అనుభవించిన రకుల్ ప్రీత్ సింగ్.. రీసెంట్‌గా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ వివాహం చేసుకుంది. వీరిద్దరూ కొన్ని సంవత్సరాలుగా రిలేషన్‌లో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. పెళ్లి తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ పెద్దగా సినిమాలు కూడా చేయడం లేదు.


సిద్ధార్థ్ - అదితి రావు హైదరి

ఈ ప్రేమ జంట ఇటీవలే వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. వీరిద్దరూ ఒక్కసారి కాదు.. రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు. మొదటిసారి తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో వీరిద్ద‌రి వివాహం ఘ‌నంగా జరగగా.. మరోసారి రాజస్థాన్‌లోని ఓ రిసార్ట్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నట్లుగా చెబుతూ వారు ఫొటోలను షేర్ చేశారు.


కిరణ్ అబ్బవరం - రహస్య గోరఖ్

‘క’ మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం ఆ సినిమా విడుదలకు ముందు తనతో కలిసి ‘రాజావారు రాణిగారు’ సినిమాలో నటించిన హీరోయిన్ రహస్య గోరఖ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.


తాప్సీ - మథియాస్ బోయ్

రకుల్ ప్రీత్ సింగ్ లానే టాలీవుడ్ నుండి బాలీవుడ్ వెళ్లిన తాప్సీ 2024 సంవత్సరంలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ఎప్పటి నుండో తాప్సీపై పెళ్లి వార్తలు వచ్చినప్పటికీ.. ఫైనల్‌గా 2024లో డెన్మార్క్ మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్‌‌ని వివాహం చేసుకుని, కొత్త జీవితాన్ని ప్రారంభించింది.


వరలక్ష్మీ శరత్ కుమార్ - నికోలాయ్ సచ్‌దేవ్

కోలీవుడ్ నటి, సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్ తను ఎప్పటి నుండో ప్రేమిస్తున్న నికోలాయ్ సచ్‌దేవ్‌ని పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకుంది. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాల‌రీ నిర్వాహ‌కుడైన నికోలాయ్ సచ్‌దేవ్‌ని ఆమె ఎప్పటి నుండో ప్రేమిస్తున్నట్లుగా పెళ్లి సమయంలో వరలక్ష్మీ శరత్ కుమార్ తెలిపింది.


సుబ్బరాజు - స్రవంతి

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు దాదాపు 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. స్రవంతి అనే అమ్మాయితో ఆయన వివాహం అయినట్లుగా ఓ ఫొటో రీసెంట్‌గా సోషల్ మీడియాలలో వైరల్ అయింది.


ఐశ్వర్య అర్జున్ - ఉమాపతి

యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం కోలీవుడ్ స్టార్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, నటుడు ఉమాపతితో చెన్నైలోని అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో వైభవంగా జరిగింది. ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ఎప్పటి నుండో ప్రేమించుకుంటూ, ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు.


మేఘ ఆకాష్ - సాయి విష్ణు

నితిన్‌ నటించిన ‘లై’ సినిమాతో టాలీవుడ్‌కి కథానాయికగా పరిచయమైన మేఘా ఆకాశ్‌ తన ప్రియుడు సాయి విష్ణుని పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రాజకీయ కుటుంబానికి చెందిన సాయి విష్ణుతో ఆమె ఎప్పటి నుండో రిలేషన్‌లో ఉన్నారు. ఫైనల్‌గా ఇరు కుటుంబాల పెద్దలు, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వారిరువురు పెళ్లి చేసుకున్నారు.


చాందిని రావు - సందీప్ రాజ్

‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్.. ఆ మూవీలో ఓ పాత్రలో నటించిన చాందిని రావుని ఇటీవల తిరుపతిలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం నుండి వీరిద్దరూ ప్రేమించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇద్దరు ఇరు కుటుంబ సభ్యులని ఒప్పించి, ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.


క్రిష్ జాగర్లమూడి - డాక్టర్ ప్రీతీ చల్లా

‘వేదం, గమ్యం, కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రాలతో టాలీవుడ్‌లో తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్న దర్శకుడు క్రిష్ రీసెంట్‌గా రెండో వివాహం చేసుకున్నారు. అంతకు ముందు డాక్టర్ రమ్యని వివాహమాడి విడాకులు తీసుకున్న క్రిష్.. మరోసారి డాక్టర్‌నే చేసుకోవడం విశేషం. డాక్టర్ ప్రీతిని ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.


కృతి కర్భందా - పులకిత్‌ సామ్రాట్‌

పవన్ కళ్యాణ్ ‘తీన్‌మార్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమున్న కృతి కర్భందా, తన ప్రియుడు పులకిత్‌ సామ్రాట్‌తో 2024లో ఏడడుగులు వేశారు. గురుగ్రామ్‌లో జరిగిన వీరి పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. తమకు వివాహమైందని తెలియజేస్తూ ఆమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి.


కీర్తి సురేష్ - ఆంటోని

స్టోరీ అప్డేట్ చేయబడుతోంది..

Updated Date - Dec 19 , 2024 | 11:27 PM