Yearender 2024: తెలంగాణ నేపథ్యంలో వచ్చి, 2024లో సక్సెస్ సాధించిన చిత్రాలివే..

ABN , Publish Date - Dec 30 , 2024 | 12:24 AM

2024 సంవత్సరం తెలంగాణ నేపథ్యంలో కూడా ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలయ్యాయి కానీ ఓ నాలుగైదు మాత్రమే బాక్సాఫీస్ వద్ద కాస్త ప్రతాపం చూపించాయి. 2024లో తెలంగాణ యాసలో తెరపైకి వచ్చిన చెప్పుకోదగ్గ సినిమాలను నిశితంగా పరిశీలిస్తే..

Telangana Based Movies in 2024

చరిత్రపుటల్లో మరో సంవత్సరం కలిసిపోనుంది. ఈ యేడాదిలో జరిగిన అనేక చేదు, తీపి జ్ఞాపకాల సమ్మేళనం మదిని నిలువనీయనంటోంది. తెలుగు చలన చిత్రపరిశ్రమకు మాత్రం ఈ యేడాది ఆశాజనకంగానే ఉందని చెప్పుకోవచ్చు. భారీ, మిడియం, చిన్న బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు నిర్మాతలకు కనకవర్షం కురిపించాయి. ఈ సంవత్సరం తెలంగాణ నేపథ్యంలో కూడా ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలయ్యాయి కానీ ఓ నాలుగైదు మాత్రమే బాక్సాఫీస్ వద్ద కాస్త ప్రతాపం చూపించాయి. 2024లో తెలంగాణ యాసలో తెరపైకి వచ్చిన చెప్పుకోదగ్గ సినిమాలను నిశితంగా పరిశీలిస్తే..


స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో నిలిచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అలాగే హైదరాబాద్ సంస్థానంలో 1940లలో తెలంగాణ ప్రాంతంలో రజాకార్ వ్యవస్థపై జరిగిన అరాచకాల మీద వచ్చిన ‘రజాకార్’ సినిమా మొదటి షో నుండే మంచి టాక్‌తో మంచి కలెక్షన్లు రాబట్టుకుంది. ఇక తెలంగాణ పెళ్లి, సాంప్రదాయాల నేపథ్యంలో వచ్చిన ‘లగ్గం’ థియేటర్లలో డీసెంట్ హిట్‌గా నిలిచి, ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా గుర్తింపును సొంతం చేసుకుంది. డిఫెరెంట్ స్టైల్ ప్రమోషన్స్‌తో ప్రేక్షకులలోకి వెళ్లిన ‘పొట్టేల్’ సినిమా పర్వాలేదని అనిపించింది. ఇంకా..

Also Read-Game Changer: డిప్యూటీ సీఎం డేట్ ఇస్తే.. హిస్టరీ రిపీట్ అవుద్ది..


‘జితేందర్ రెడ్డి, ఉరుకు పటేలా, లైన్ మాన్, ప్రవీణ్ IPS, కళ్ళు కాంపౌండ్, పైలం పిలగా, షరతులు వర్తిస్తాయి, గొర్రెపురాణం, బహిర్భూమి, కేశవ చంద్ర రమావత్..’ ఇలా ఎన్నో వైవిధ్య భరితమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించిన ఫలితాలను మాత్రం అందుకోలేకపోయాయి. ఇన్ని సినిమాలు తెలంగాణ నేపథ్యంలో వచ్చినా.. కథ, కథనాలు రొటీన్‌గా ఉండడం, మేకింగ్ పరంగా నాసిరకంగా ఉండటం, నిర్మాణ విలువలు లేకపోవడంతో చాలా సినిమాలు చతికిలపడ్డాయి.


అటు ఓటీటీల్లోనూ తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలకు మంచి ఆదరణే లభించిందని చెప్పుకోవాలి. గాయని సునీత తనయుడు హీరోగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమ్పర్పణలో వచ్చిన ‘సర్కారు నౌకరి’ OTT ప్రేక్షకుల మన్ననలు పొందింది. అలాగే థియేటర్లలో పాజిటివ్ టాక్‌తో ఓటీటీలోకి వచ్చిన ‘లగ్గం’ చిత్రం ఆహా, అమెజాన్ ప్రైమ్‌లలో అటు తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుండటం విశేషం. పెద్ద హీరో, చిన్న హీరో అనే తేడా లేకుండా కంటెంట్ బావుంటే థియేటర్లలోనే కాకుండా ఓటీటీలలో కూడా మంచి సక్సెస్ సాధిస్తాయని కొన్నిచిత్రాలు నిరూపించాయి.


Directors.jpg

మొత్తంగా చూస్తే తెలంగాణ యాసతో వచ్చి 2024లో హిట్ కొట్టిన దర్శకులుగా.. ‘టిల్లు స్క్వేర్’ దర్శకుడు మల్లిక్ రామ్, ‘రజాకర్’ దర్శకుడు యాట సత్యనారాయణ, ‘లగ్గం’ చిత్ర దర్శకుడు రమేశ్ చెప్పాల.. మంచి పేరు సాధించి పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. వీరిచ్చిన స్ఫూర్తితో 2025లో తెలంగాణ నేపథ్యంలో మరిన్ని మంచి సినిమాలు వస్తాయని ఆశిద్దాం..

Also Read-Game Changer: ‘గేమ్ చేంజర్’ యూనిట్‌కు రామ్ చరణ్ ఫ్యాన్ వార్నింగ్

Also Read-Devi Sri Prasad: 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్' వెనుక ఏం జరిగిందంటే..

Also Read-Tollywood: అల్లు అర్జున్ ఎఫెక్ట్.. ‘మా’ మంచు విష్ణు అలెర్ట్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 30 , 2024 | 12:24 AM