Year Ender 2024: ఈ ఏడాది కూడా సౌత్ సినిమానే టాప్
ABN , Publish Date - Dec 20 , 2024 | 04:22 PM
Rewind 2024: ఈ ఏడాది కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాల జోరు కనిపించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో టాప్‌లో నిలిచిన సినిమాలు ఏవేవి అంటే..
రాజమౌళి ఏ ముహుర్తాన 'బాహుబలి' కి శ్రీకారం చుట్టాడో తెలీదు గాని భారతీయ సినిమాని సౌత్ ఇండియా సినిమా ఏలడానికి అక్కడే బీజం పడింది. బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ , కేజీఎఫ్, సలార్, కల్కి, హనుమాన్, యానిమల్, పుష్ప 2 వంటి సినిమాలు ప్యూర్ డామినేషన్ చూపించాయి. ఈ ఏడాది కూడా సౌత్ సినిమాలదే పైచేయి. ఆలస్యం చేయకుండా ఆ ఈ ఏడాది సౌత్‌లో టాప్ 5గా నిలిచిన సినిమాలేంటో చూసేద్దామా..
పుష్ప 2
భారీ అంచనాలు, అనేక వివాదాల మధ్య రిలీజైన అల్లు అర్జున్, సుకుమార్ సినిమా 'పుష్ప 2' సరికొత్త చరిత్రని సృష్టించింది. విడుదలైన 14 రోజుల్లోనే 1500 కోట్ల గ్రాస్ ని సాధించింది. అల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ లో బాహుబలి 2, దంగల్ సినిమాలకి కాస్త వెనకబడిన కొద్దీ రోజుల్లోనే ఆ రికార్డులు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.
కల్కి 2898 AD
ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 AD కూడా ప్రఖ్యాత రూ. 1000 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసింది. ఓవరాల్ గా రూ. 1019.8 కోట్లను కొల్లగోట్టింది. రూ. 375 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో కాశీని ఒక డిస్టోపియన్ నగరంగా చూపించారు.
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (Goat)
దళపతి విజయ్ నటించిన తమిళ చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ థర్డ్ ప్లేస్ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.456.6 కోట్లు కొల్లగొట్టింది. రూ.240 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (SATS) కోసం పని చేస్తున్న గూఢచారి, ఫీల్డ్ ఏజెంట్ గాంధీ కథను ఈ మూవీలో చూపించారు. ప్లాప్ టాక్ తోనే ఈ సినిమా రికార్డులు సృష్టించడం విశేషం.
దేవర: పార్ట్ 1
జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం దేవర. రూ.185 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.414.1 కోట్లు కొల్లగొట్టింది. తన గ్రామంలో నేరాలకు వ్యతిరేకంగా నిలబడిన సముద్ర యోధుడు దేవర చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది.
అమరన్
ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. ఈ మూవీలో సాయి పల్లవి ఆయువుపట్టుగా నిలిచింది. దీపావళి కానుకగా రిలీజైన ఈ మూవీని రూ .70 కోట్ల స్మాల్ బడ్జెట్ తో నిర్మించారు. ఓవరాల్ బాక్సాఫీస్ వద్ద రూ. 326.5 కోట్లు కొల్లగొట్టింది. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన కేరళ రాష్ట్రానికి చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
హనుమాన్
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. సూపర్ హీరో కథకు ఇతిహాసాన్ని జోడించి తీసిన ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించగా.. అమృతాఅయ్యర్ కథానాయిక నటించారు. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించారు. రూ.40 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టించింది.
తరువాతి స్థానాల్లో మంజుమ్మెల్ బాయ్స్ (మలయాళం), వేట్టైయన్ (తమిళం), గుంటూరు కారం (తెలుగు), ది గోట్ లైఫ్(మలయాళం), రాయన్ (తమిళం) నిలిచాయి.