Yearender 2024: 2024లో బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన పది చిత్రాలు

ABN , Publish Date - Dec 29 , 2024 | 05:14 AM

ఈ ఏడాది బాలీవుడ్‌లో అనేక చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో కొన్ని బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్‌ అయ్యాయి. కొన్ని రూ.100 కోట్ల క్లబ్‌లో చేరితే.. మరికొన్ని..

ఈ ఏడాది బాలీవుడ్‌లో అనేక చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో కొన్ని బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్‌ అయ్యాయి. కొన్ని రూ.100 కోట్ల క్లబ్‌లో చేరితే.. మరికొన్ని బొక్కబోర్లా పడ్డాయి. ఈ నేపథ్యంలో 2024లో బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన పది చిత్రాలు ఏవో చూద్దాం!

స్త్రీ-2:

రాజ్‌కుమార్‌, శ్రద్ధాకపూర్‌ నటించిన ఈ హారర్‌ కామెడీ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.837 కోట్లు వసూలు చేసి బాలీవుడ్‌లో ఈ ఏడాది తొలి స్థానంలో నిలిచింది.

భూల్‌ భులయ్యా-3:

ఇది కూడా హారర్‌ కామెడీ చిత్రమే. గ్లోబల్‌గా రూ.371 కోట్ల వసూళ్లతో రెండో స్థానంలో నిలిచింది. అనీస్‌ బాజ్మీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తీక్‌ ఆర్యన్‌, విద్యాబాలన్‌, మాధురి దీక్షిత్‌, త్రిప్తీ డిమ్రీ తదితరులు నటించారు.


సింగం ఎగైన్‌:

రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అజయ్‌ దేవగణ్‌, రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనే, అర్జున్‌ కపూర్‌, టైగర్‌ ష్రాఫ్‌, కరీనాకపూర్‌, అక్షయ్‌ కుమార్‌ వంటి భారీ తారాగణం నటించారు. అయినప్పటికీ ఇదే సమయంలో విడుదలైన భూల్‌ భులయ్యా-3ని ఏమ్రాతం అధిగమించలేదు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.367 కోట్లు వసూలు చేసి తృతీయ స్థానంలో నిలిచింది.

ఫైటర్‌:

హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటించారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం యావరేజ్‌ టాక్‌తో గ్లోబల్‌ వైడ్‌గా రూ.340 కోట్లు వసూలు చేసింది. విదేశాల్లో రూ.140 కోట్లు రాగా, ఇండియా వ్యాప్తంగా రూ. 200 కోట్లను రాబట్టగలిగింది.

షైతాన్‌:

ఇది ఒక సూపర్‌ నేచురల్‌ హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం. వికాస్‌ దర్శకత్వంలో అజయ్‌ దేవగణ్‌, మాధవన్‌, జ్యోతిక తదితరులు నటించారు. గుజరాతి చిత్రం ‘వశ్‌’ ఆధారంగా నిర్మించిన ఈ సినిమా రూ.210 కోట్ల కలెక్షన్లు సాధించింది.

11-Cj.jpg

క్రూ:

రాజేశ్‌ కృష్ణన్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రమిది. ఎయిర్‌హోస్టె్‌సగా పనిచేస్తున్న ముగ్గురు మహిళల జీవితం ఆధారంగా నిర్మించిన ఈ చిత్రంలో టబు, కరీనా కపూర్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. రూ.150 కోట్లతో ఫరవాలేదనిపించింది.


తేరీ బాతోన్‌ మే ఐసా ఉల్జా జియా:

ఈ సైంటిఫిక్‌ ఫీక్షన్‌ రొమాంటిక్‌ కామెడీ చిత్రంలో షాహీద్‌ కపూర్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. మానవుడు, రోబోకు మధ్య నడిచే ప్రేమ కథ ఇది. అమిత్‌ జోషీ, ఆరాఽధనా షా దర్శకత్వం వహించారు. రూ.136 కోట్ల వసూళ్లతో సరిపెట్టుకుంది.

ముంజ్యా:

ఆదిత్య సర్వోథ్థర్‌ దర్శకత్వంలో వచ్చిన సూపర్‌ నేచురల్‌ యూనివర్సల్‌ చిత్రం. శర్వరీ, అభయ్‌ వర్మ, సత్యరాజ్‌, మోనా సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. విమర్శకుల నుంచి సానుకూల సమీక్షలు పొందినప్పటికీ ఎక్కువగా వసూళ్లు రాబట్టలేకపోయింది. గ్లోబల్‌ వైడ్‌గా రూ. 128 కోట్లు సాధించగలిగింది.

బ్యాడ్‌ న్యూజ్‌:

గుడ్‌ న్యూజ్‌కి ఆధ్యాత్మిక సీక్వెల్‌గా వాస్తవాధారిత ఘటనల ఆధారంగా నిర్మించిన హాస్య భరిత చిత్రం. విక్కీ కౌశల్‌, ట్రిప్తీ డిమ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆనంద్‌ తివారీ దర్శకుడు. బాక్సాఫీసు వద్ద రూ.109 కోట్లను వసూలు చేసింది.

బడే మియా చోటే మియా:

ఈ సైన్స్‌ ఫీక్షన్‌ యాక్షన్‌ సినిమాలో టైగర్‌ ష్రాఫ్‌, అక్షయ్‌ కుమార్‌, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించారు. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా రూ.105 కోట్ల వసూళ్లతో వంద కోట్ల క్లబ్‌లో పదో స్థానంలో నిలిచింది.

Updated Date - Dec 29 , 2024 | 06:58 AM