Bandla Ganesh: బండ్లన్నకి ఏమైంది.. ఎవరు మోసం చేశారో తెలుసా
ABN , Publish Date - Oct 01 , 2024 | 05:15 PM
బండ్ల గణేష్ కొన్ని నెలల క్రితం ల్యాండ్ గ్రాబింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. దీంతో పలు కాంట్రావర్సీలతో డీలా పడ్డాడు. వరుస ట్వీట్ల ఆంతర్యమేమిటి?
బండ్ల గణేష్(Bandla Ganesh).. స్టార్ ప్రొడ్యూసర్‌గా, కమెడియన్‌గా తెలుగు సినీ పరిశ్రమలో తన మాటలతో చేతలతో ఎప్పుడు లైమ్ లైట్లో ఉంటారు. పవర్ ఫుల్ స్పీచ్‌లు, పంచ్ డైలాగ్‌లతోపాటు స్ట్రెయిట్ అండ్ బోల్డ్‌గా తన అభిప్రాయాల్ని తెలుపుతూ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. ఇలాంటి బండ్లన్న ఈ మధ్యలో పలు కాంట్రావర్సీలతో డీలా పడ్డాడు. తాజాగా వరుస ట్వీట్లతో తన బాధని సోషల్ మీడియాలో ద్వారా బయటపెట్టుకున్నాడు. ఇంతకీ బండ్లన్నకి ఏమైంది? ఎవరు మోసం చేశారు?
"జీవితంలో ఎవరిని నమ్మొద్దు మిమ్మల్ని మీరు మాత్రమే నమ్ముకోండి", "ఎవరి దగ్గర నుంచైనా మనం సహాయం ఆశించామా, మనల్ని యాచుకుల్లా చూస్తారు జాగ్రత్త" అంటూ వరసగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన ఫ్యాన్స్ ఏమైందని ఆరాలు తీస్తున్నారు. తన దైవం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఏమైనా అన్నాడా? లేకపోతే గురూజీ ఏమైనా హ్యాండ్ ఇచ్చాడా అంటూ ఫ్యాన్స్ పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. బండ్ల గణేష్ కొన్ని నెలల క్రితం ల్యాండ్ గ్రాబింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. గతంలోనూ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్(Puri Jagannadh), ప్రొడ్యూసర్ ప్రసాద్ వి పొట్లూరితోను ఆయనకు గొడవలు జరిగాయి. దీంతో ఇండస్ట్రీ వాళ్ళని ఉద్దేశించి గణేష్ ఈ ట్వీట్స్ చేశాడా లేదా పొలిటికల్, బిజినెస్, పర్సనల్ కారణాల వల్ల ఈ ట్వీట్స్ చేశాడా అని సోషల్ మీడియాలో దూమారం రేకెత్తుతోంది.
1996లో ఎస్వీ కృష్ణారెడ్డి(SV Krishna Reddy) 'వినోదం' సినిమాతో బండ్ల గణేష్ తెరంగ్రేటం చేశారు. 1998లో వచ్చిన 'సుస్వాగతం' సినిమా చూసిన ఆయన పవన్ కళ్యాణ్‌తో ఎలాగైనా కలిసి నటించాలనుకున్నారు. 2009లో పరుశురామ్ దర్శకత్వం వహించిన రవితేజ మూవీ ఆంజనేయులు తో ఆయన ప్రొడ్యూసర్ అవతారమెత్తారు. తన బ్యానర్లో చివరిగా 2015లో టెంపర్ సినిమా నిర్మించారు. 2022లో డేగల బాబ్జి అనే సినిమాలో లీడ్ నటించిన గణేష్ అదే సంవత్సరం వచ్చిన మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియాలో నటించారు.