Rain in PVR : పీవీఆర్‌లో వర్షం.. షాక్‌కు గురైన ఆడియన్స్ 

ABN , Publish Date - Jul 15 , 2024 | 01:45 PM

ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) వసూళ్లు వర్షం కురిపించడమే కాదు థియేటర్‌లోను వర్షం కురిపించింది. పంజాగుట్టలోని పీవీఆర్‌ (Rain in PVR cinemas) థియేటర్‌లో సినిమా చూద్దామని వెళ్లిన ఫ్యాన్స్‌, ప్రేక్షకులకు చుక్కలు కనిపించాయి.

ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) వసూళ్లు వర్షం కురిపించడమే కాదు థియేటర్‌లోను వర్షం కురిపించింది. పంజాగుట్టలోని పీవీఆర్‌ (Rain in PVR cinemas) థియేటర్‌లో సినిమా చూద్దామని వెళ్లిన ఫ్యాన్స్‌, ప్రేక్షకులకు చుక్కలు కనిపించాయి. బాక్సాఫీస్‌ బరిలో ఈ సినిమాకు వసూళ్ల వర్షం కురవడం కాదు... థియేటర్‌ లోపల నిజంగా వర్షం కురిసింది. దాంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు షాకయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురి అయ్యారు. ఆ తర్వాత షో క్యాన్సిల్‌ కావడంతో తీరిగ్గా బయట పడ్డారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. ఆ వర్షం ప్రభావం ‘కల్కి 2898 ఏడీ’ సినిమాపై పడింది. (Panjagutta PVR Cinemas)

నగరం నడిబొడ్డున ఉన్న పీవీఆర్‌ పంజాగుట్టకు వెళ్లిన ఆడియన్స్  ప్రభాస్‌ సినిమా పూర్తిగా చూడకుండానే వెనుదిరిగారు. నగరంలో కురిసిన భారీ వర్షాలకు పీవీఆర్‌ పంజాగుట్ట థియేటర్‌ పైకప్పు డ్యామేజ్‌ అయ్యింది. దాంతో థియేటర్‌ లోపలకు వర్షపు నీరు కురిసింది. తమ మీద నీరు పడటంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఏమీ అర్థం కాలేదు. చివరకు, ఆ షో క్యాన్సిల్‌ చేసి మధ్యలోనే ప్రేక్షకుల్ని బయటకు పంపించారు. ఇదంతా వీడియో తీసి ఓ ప్రేక్షకుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అయింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షం నీటికి షార్ట్‌ సర్క్యూట్‌ అయితే పరిస్థితి ఏంటి  ఏంటి? అని పీవీఆర్‌ సిబ్బందిని నిలదీస్తున్నారు. పూర్‌ మెయింటెనెన్స్ అని మరో నెటిజన ట్వీట్‌ చేశాడు. ఈ వీడియోలు చూసిన జనాలు షాక్‌కి గురయ్యారు. 

Updated Date - Jul 15 , 2024 | 01:46 PM