Samyuktha: 'విరూపాక్ష' కథానాయకురాలు పెళ్లి చేసుకుంటోందా... నిజమేనా...

ABN , Publish Date - Jan 02 , 2024 | 05:38 PM

మలయాళం నటి సంయుక్త విజయవంతమైన కథానాయకురాలిగా పేరు తెచ్చుకున్న, ఇప్పుడు చేతిలో సినిమాలు ఏమీ లేవు. ఆమె వివాహం చేసుకుంటోంది అని, అందుకే కొత్త సినిమాలు ఒప్పుకోవటం లేదని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది.

Samyuktha: 'విరూపాక్ష' కథానాయకురాలు పెళ్లి చేసుకుంటోందా... నిజమేనా...
Samyuktha

మలయాళం నటి అయిన సంయుక్త తెలుగులో 'భీమ్లా నాయక్' సినిమా ద్వారా పరిచయం అయింది. ఆ సినిమాలో ఆమె రానా దగ్గుబాటి భార్యగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. తరువాత ఆమె వరసగా 'బింబిసార', 'విరూపాక్ష', 'సర్' సినిమాలలో నటించి తెలుగులో విజయవంతమైన కథానాయకురాలిగా పేరు తెచ్చుకుంది. ఇందులో చాలా సినిమాలు పీరియడ్ డ్రామాలు అవటం విశేషం. అలాగే ఈ సినిమాలతో సంయుక్త ప్రతిభ గల నటిగా పేరు తెచ్చుకోంది. (Samyuktha is going to tie the knot this year)

అలాగే తాజాగా విడుదలైన 'డెవిల్' సినిమాలో కూడా సంయుక్త కథానాయికగా నటించింది. ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడు, ఇది కూడా పీరియడ్ డ్రామా నేపధ్యం వున్న కథ అవటం ఆసక్తికరం. అయితే ఇప్పుడు సంయుక్త గురించిన ఒక వార్త సామజిక మాధ్యమాల్లో, కొన్ని మీడియా వెబ్ సైట్స్ లో వైరల్ అవుతోంది. అదేమిటి అంటే సంయుక్త ఈ సంవత్సరం వివాహం చేసుకోబోతోంది అని.

samyuktha2.jpg

ఇంతకీ వరుడు ఎవరు అంటే, ఆమె బాయ్ ఫ్రెండ్ అని అంటున్నారు. అతను ఎవరో, ఎక్కడ పని చేస్తారో మాత్రం వివరాలు రాయటం లేదు, కానీ ఆమె ఇప్పుడు రిలేషన్ షిప్ లో వుంది అని, ఈ సంవత్సరం వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది అని మాత్రం వార్త వైరల్ అవుతూ ఉండటం ఆసక్తికరం.

28 ఏళ్ల సంయుక్త కి ఇంకా చాలా భవిష్యత్తు వుంది అని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు వివాహం చేసుకున్న నటీమణులు కూడా బాగా రాణిస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే మరి సంయుక్త వివాహం అయ్యాక సినిమాలలో నటిస్తుందో, లేక మొత్తం విడిచిపెట్టి వెళ్లిపోతుందో అనేది మాత్రం క్లారిటీ లేదు.

Updated Date - Jan 02 , 2024 | 05:38 PM