Varun Sandesh-Vithika: వ‌రుణ్ సందేశ్‌, వితికా గృహ‌ప్ర‌వేశం.. వీడియో వైర‌ల్‌

ABN , Publish Date - Feb 20 , 2024 | 07:53 PM

వితికా షెరు, వరుణ్ సందేశ్ జంట‌ తాజాగా త‌మ ఇంటి గృహ ప్ర‌వేశానికి సంబంధించిన వీడియో యూ ట్యూబ్‌లో పోస్టు చేయ‌గా ట్రెండింగ్‌లో నిలిచింది.

Varun Sandesh-Vithika: వ‌రుణ్ సందేశ్‌, వితికా గృహ‌ప్ర‌వేశం.. వీడియో వైర‌ల్‌
vithika varun

రెండు తెలుగు రాష్ట్రాల‌లో, ముఖ్యంగా యూ ట్యూబ్‌ను ఫాలో అయ్యేవారికి బాగా సుప‌రిచితం వితికా షెరు (Vithika Sheru), వరుణ్ సందేశ్ (Varun Sandesh) జంట‌. 2019లో వివాహ బంధంలోకి అడుగు పెట్టిన వీరు ఆ త‌ర్వాత బిగ్‌బాస్‌3 తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలాఉండ‌గా ఈ మ‌ధ్య సినిమా అవ‌కాశాలు త‌గ్గ‌డంతో వ‌రుణ్ సందేశ్‌ ఎక్కువ‌గా అమెరికాలోనే ఉంటుండ‌గా ఆయ‌న భార్య వితికా మాత్రం డిజైన‌ర్‌గా, ప్ర‌జంట‌ర్‌గా రాణిస్తూనే ఇప్పుడు యూ ట్యూబ‌ర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. త‌న యూట్యూబ్‌లో పెట్టే వీడియోలతో మిలియ‌న్లు దాటి వ్యూస్ సాదిస్తుంద‌టే ఆమె వీడియోల‌కు ఎంత డిమాండ్ ఉందో ఇట్టే అర్ధ‌మ‌వుతుంది.

77635041.jpg

తాజాగా త‌మ ఇంటి గృహ ప్ర‌వేశానికి సంబంధించిన వీడియోను పోస్టు చేయ‌గా నిమిషాల్లోనే ల‌క్ష‌ల వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో ఉంది. అయితే 2023 మేలో ఈ గృహ‌ప్ర‌వేశం జ‌రుగ‌గా వితికా (Vithika Sheru) రెండు రోజుల క్రితం త‌న యూ ట్యూబ్‌లో పోస్టు చేసింది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ఆ ఇంది కోసం త‌ను ప‌డిన క‌ష్టాన్ని వివ‌రించింది. తమ ఇంటి గురించి వివరిస్తూ ప్రతి విషయంలో వారు తీసుకున్న‌ జాగ్రత్తలను వివరించింది.


Varun-Sandesh-Vithika-Sheru-Wedding-Date-Revealed-1200x800.jpg

అస‌లు నా సొంత డ‌బ్బుతోనే స్వంతంగా ఇల్లు క‌ట్టుకోవాల‌నుకున్నాన‌ని కానీ కుద‌ర‌లేద‌ని మా మామయ్య- అత్తయ్యలున్న‌ పాత ఇంటినే వ‌రుణ్‌, నా అభిరుచుల‌కు అనుగుణంగా ద‌గ్గ‌రుండి డిజైన్ చేసుకున్నామ‌ని తెలిపింది. చాలా రోజుల నుంచి చాలామంది రెగ్యుల‌ర్‌గా వీడియోలు చేయ‌ట్లేద‌ని అడుగుతున్నార‌ని, అయితే ఇన్ని రోజులు సొంత ఇల్లు లేకున్నా అలా జ‌రిగింద‌ని ఇక‌పై అలా ఉండ‌ద‌ని రెగ్యుల‌ర్‌గా కొత్త‌కొత్త కాన్సెప్ట్‌ల‌తో వీడియోలు చేస్తాన‌ని చెప్పుకొచ్చింది. వ‌రుణ్‌, వితికా (Vithika Sheru) ల గృహ ప్ర‌వేశం వీడియోను చూసిన సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు, స‌న్నిహితులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. మీరు ఇంత‌వ‌ర‌కు ఈ వీడియో చూడ‌లేదా.. అయితే ఇప్పుడే చూసేయండి మ‌రి.

Updated Date - Feb 20 , 2024 | 07:59 PM