Keerthi: మహిళలపై అరాచకాలు జరుగుతుంటే దేవుడెక్కడ? అంటూ నటి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 09 , 2024 | 03:51 PM
మహాశివరాత్రి వేళ బిగ్‌బాస్ కంటెస్టెంట్, టీవీ నటి కీర్తి భట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటూ ఆరోపణలు చేశారు. కీర్తి భట్ తాజాగా ఓ సెల్ఫీ వీడియో షేర్ చేసింది. మనం ప్రతి రోజూ దేవుడిని వేడుకుంటాం. శివరాత్రి అనే కాదు.. ఎప్పుడూ దేవుడుకి పూజాలు చేస్తుంటాం. ఎందుకు చేస్తాం.. అందరు బాగుండాలనే కదా.. అందరికీ మంచి జరగాలనే కదా.. అంటూ ఆమె ఆవేదనను వ్యక్తం చేసింది.
మహాశివరాత్రి వేళ బిగ్‌బాస్ కంటెస్టెంట్, టీవీ నటి కీర్తి కేశవ్ భట్ (Keerthi Keshav Bhat) సంచలన వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటూ ఆరోపణలు చేశారు. కీర్తి భట్ తాజాగా ఓ సెల్ఫీ వీడియో షేర్ చేసింది. మనం ప్రతి రోజూ దేవుడిని వేడుకుంటాం. శివరాత్రి అనే కాదు.. ఎప్పుడూ దేవుడుకి పూజాలు చేస్తుంటాం. ఎందుకు చేస్తాం.. అందరు బాగుండాలనే కదా.. అందరికీ మంచి జరగాలనే కదా. కానీ దేశంలో మహిళలపై అరాచకాలు, అఘాయిత్యాలు జరుగుతుంటే ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? ‘మాట్లాడదామా, వద్దా అని అనుకుంటూనే ఫోన్ చూస్తున్నా. ఈ రోజు మహాశివరాత్రి (Maha Shivratri). దేవుడు కోసం అది ఇది అన్ని చేస్తాం. నైవేద్యాలు పెడతాం.. పూజలు చేస్తాం. ఈ రోజే కాదు.. ఇంకేరోజైన దేవుడికి పూజలు చేస్తాం. అవన్ని ఎందుకు.. అందరు బాగుండాలి, అందరికీ మంచి జరగాలనే కదా? అని ప్రశ్నించింది.
ఇంకా ఆమె (#KeerthiKeshavBhat) మాట్లాడుతూ.. కానీ ఆ మంచి జరగడం లేదు. ఒక చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. అప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకున్నాడు. పెద్దవాళ్లు అయితే ఏదో ఒకలా తప్పించుకోవడం వంటివి చేస్తారు. అదీ చిన్న పిల్ల.. అంతమంది క్రూరంగా దానిపై దాడి చేశారు. ఆ చిన్నది ఏం చేస్తుంది. ఇలాంటి ఘటనలను దేవుడు ఆపకుండా ఏం చేస్తున్నాడు. చూస్తూ ఊరుకుంటున్నాడు. ఆ సమయంలో ఆ చిన్నారి ఎంత నరకయాతన అనుభవించి ఉంటుంది. అప్పుడు ఆమెను దేవుడు కాపాడాలి, లేదా ఆ చిన్నారికి అలాంటి ఘటనే ఎదురవకుండా చూడాలి. ఆ అఘాయిత్యం నుంచి తప్పించుకునేలా చేయాలి. కానీ ఏం చేయకుండా చూస్తూ కూర్చున్నాడు. కనీసం తప్పించుకోవడానికైనా సాయం చేయవచ్చు కదా. అలాంటి టైంలో కాపాడలేని దేవుడు ఎందుకు? పసిపిల్లలంటే దేవునితో సమానం అంటారు కదా.. మరి ఆ పసిపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇందుకేనా రోజూ దేవుడికి పూజలు చేయాలి.. ఇది చాలా దారుణం కదా.. ఇవన్నీ చూస్తుంటే అసలు దేవుడే లేడనిపించింది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. (Keerthi Keshav Bhat Viral Video)
అంతేకాదు పేదవాళ్లు పేదవాళ్లగానే ఉంటున్నారని, ధనికులు మరింత ధనవంతులను అవుతున్నారని ఆమె వ్యాఖ్యానించింది. ప్రస్తుతం కీర్తి కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్‌గా మారాయి. దేవుడిపై ఇలాంటి ఆరోపణలు చేయడమేంటని, అదీ కూడా మహాశివరాత్రి రోజున ఇలా మాట్లాడటం ఏంటి అనే డిస్కషన్ జరుగుతోంది. మరి ఏ చర్చలు ఎంత వరకు వెళతాయో చూడాలి.. (Bigg Boss Fame Keerthi Sensational Comments on God)
ఇవి కూడా చదవండి:
====================
*Odela 2: శివశక్తిగా తమన్నా భాటియా.. ఫస్ట్ లుక్ ఇదే..
****************************
*Usha Parinayam: దుబాయ్‌లో అయింది.. ఇప్పుడు కాశ్మీర్‌లో..
*******************************
*Gaami Movie Review: విశ్వక్ సేన్ ‘గామి’ సినిమా ఎలా ఉందంటే...
****************************