Jr NTR: అప్పుడు లౌక్యంగా.. ఇప్పుడు డైరెక్ట్‌గా.. ఏంటిది తారక్
ABN , Publish Date - Oct 03 , 2024 | 09:20 PM
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్క తాటిమీదకు వచ్చి అక్కినేని ఫ్యామిలీ, సమంతలకు సపోర్ట్‌గా నిలబడుతోంది. తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ చేసిన వివాదస్పద కామెంట్స్‌ని సినిమా ఇండస్ట్రీ అంతా ఖండిస్తోంది. అలా ఖండించిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. కాకపోతే.. ఆయన రియాక్షన్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోలింగ్ జరుగుతోంది. తారక్‌పై ట్రోలింగ్ ఎందుకు జరుగుతుందంటే..
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్క తాటిమీదకు వచ్చి అక్కినేని ఫ్యామిలీ, సమంతలకు సపోర్ట్‌గా నిలబడుతోంది. తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ చేసిన వివాదస్పద కామెంట్స్‌ని సినిమా ఇండస్ట్రీ అంతా ఖండిస్తోంది. బుధవారం కొంతమంది సెలబ్రిటీలు ట్విట్టర్ వేదికగా రెస్పాండ్ కాగా, గురువారం మాత్రం దాదాపు ఇండస్ట్రీ మొత్తంలో కదలిక వచ్చింది. స్టార్ హీరోల నుంచి, మీడియం, స్మాల్ హీరోల వరకు అంతా ముక్తకంఠంగా కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ.. వెంటనే ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఫైర్ అవుతున్నారు. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ.. ఇదే విషయంపై స్పందించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై మాత్రం కొందరు నందమూరి అభిమానులు గరం గరం అవుతున్నారు. అందుకు కారణం ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనలే.
Also Read- Rakul Preet Singh: కొండా సురేఖ వ్యాఖ్యలపై రకుల్ ప్రీత్ సింగ్ కూడా స్పందించింది..
విషయంలోకి వస్తే.. ‘‘కొండా సురేఖగారు వ్యక్తిగత జీవితాలను బయటకులాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ. ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించేలా వ్యవహరించాలి. బాధ్యతారహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం. మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చొనేది లేదు. ఒకరినొకరు గౌరవించుకోవడం, పరిధి దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని కచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను మన సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదు’’ అని మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై ఎన్టీఆర్ స్పందించారు. అయితే ఎన్టీఆర్ స్పందించినందుకు అంతా హ్యాపీనే కానీ.. ఇలాంటి సంఘటనే తనకు అయినవారికి జరిగినప్పుడు ఎన్టీఆర్ స్పందనను తీసుకుని.. నెటిజన్లు బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు.
ఏపీలోని గత ప్రభుత్వం.. చంద్రబాబు నాయుడిని, ఆయన భార్యని అవమానించినప్పుడు యావత్తు దేశం అంతా ఖండించింది. కానీ ఎన్టీఆర్ మాత్రం చాలా లౌక్యంగా మాట్లాడి.. స్పందించానంటే స్పందించాను అనేలా కామ్ అయ్యాడు. అప్పుడు అవమానించిన వారి పేర్లు తెలుసు, అధికారంలో ఉన్న వారెవరో కూడా తెలుసు. కానీ ఒక్కరి పేరు కూడా ప్రస్తావించకుండా.. చాలా లౌక్యంగా ఎన్టీఆర్ మాట్లాడారు. కానీ ఇప్పుడు.. కొండా సురేఖ అంటూ పేరు ప్రస్తావించి మరీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇదే ఇప్పుడు నెటిజన్లకు ఆయుధంగా దొరికింది. ‘అప్పుడేమైంది నీ తెగువ.. వాళ్లు నీ స్నేహితులనేనా.. అంత సాఫ్ట్‌గా మాట్లాడావు.. ఇప్పుడేమో పరుధులు అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావ్’, ‘మేనమామ, మేనత్త అవసరం లేదు కానీ.. అక్కినేని ఫ్యామిలీకి కష్టం వస్తే మాత్రం అరక్షణం కూడా ఆగలేవా’, ‘ఇండస్ట్రీలోని వ్యక్తులు పవన్ కళ్యాణ్‌ని, ఆయన ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు ఎందుకు రియాక్ట్ కాలేదు. ఆయన కూడా సినిమా వ్యక్తేగా.. అప్పుడేమైనాయ్ నీ పరిధులు’ అంటూ జూనియర్ ఎన్టీఆర్‌పై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.
Also Read- Konidala Anjana Devi: పవన్ కళ్యాణ్ రాజకీయాలపై అంజనమ్మ సంచలన వ్యాఖ్యలు
Also Read- Samantha: కొండా సురేఖ కాంట్రవర్సీ వ్యాఖ్యలపై సమంత స్ట్రాంగ్ కౌంటర్
Also Read- Tollywood: సినిమాల కరువులో.. టాలీవుడ్ భామలు
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గతంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోను క్రింది ట్వీట్‌లో చూడవచ్చు..