Naga Shaurya- Darshan: అతనేంటో నాకు తెలుసు.. హాని చేసే వ్యక్తి కాదు 

ABN , Publish Date - Jun 28 , 2024 | 01:31 PM

కన్నడ హీరో దర్శన్ (Darshan) తన అభిమాని హత్య కేసులో నిందితుడిగా అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. తన ప్రేయసి పవిత్ర గౌడనుకు అసభ్యకరమైన సందేశాలు పంపించాడనే కోపంతో పక్కా ప్లాన్ తో  రేణుకా స్వామిని  (Renuka swami) అతి క్రూరంగా హత్య చేశారు.

Naga Shaurya- Darshan: అతనేంటో నాకు తెలుసు.. హాని చేసే వ్యక్తి కాదు 


కన్నడ హీరో దర్శన్ (Darshan) తన అభిమాని హత్య కేసులో నిందితుడిగా అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. తన ప్రేయసి పవిత్ర గౌడనుకు అసభ్యకరమైన సందేశాలు పంపించాడనే కోపంతో పక్కా ప్లాన్ తో  రేణుకా స్వామిని  (Renuka swami) అతి క్రూరంగా హత్య చేశారు. ఈ కేసు విషయంలో యావత్  కన్నడ ప్రజానీకం రేణుకాస్వామికి మద్దతుగా నిలిచింది. కొందరు మాత్రం దర్శన్ కు  మద్దతుగా  నిలిస్తే ఎక్కువశాతం మాత్రం అతను శిక్ష అనుభవించాల్సిందే అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య (Naga Shaurya) దర్శనకు మద్దతుగా నిలిచారు. త్వరలోనే నిజానిజాలు బయటికి వస్తాయని ఇనస్టాలో పోస్ట్‌ పెట్టారు.  Naga Shaurya support to Darshan)

‘‘చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఈ కష్ట సమయంలో వారికి ఆ దేవుడు బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే చాలామంది కేసు కోర్టులో ఉండగానే సోషల్‌ మీడియాలో తీర్పులు ఇచ్చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకూ దర్శన్‌ అన్న కలలో కూడా ఇతరులకి హాని చేసే వ్యక్తి కాదు. అతని గురించి బాగా తెలిసిన వాళ్లకి ఖచ్చితంగా అతని క్యారెక్టర్‌, మనసు గురించి అర్థమవుతుంది. ఎప్పుడైనా ఎవరికైనా సాయం చేయాలని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని చూస్తాడు. ఎంతోమంది జీవితాలను ఆయన నిలబెట్టాడు. అందుకే నేనీ విషయాన్ని నమ్మలేకపోతున్నా. నాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. ఖచ్చితంగా త్వరలోనే నిజాలు బయటకొస్తాయి’’ అంటూ నాగశౌర్య పోస్ట్‌లో పేర్కొన్నాడు. అటు రేణుకా స్వామి కుటుంబం మాత్రమే కాదు.. దర్శన కుటుంబం కూడా సఫర్‌ అవుతోందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. వారి ప్రైవసీ, గౌరవానికి దయచేసి ఇలాంటి సమయంలో భంగం కలిగించవద్దు. త్వరలోనే దర్శన్‌ నిర్దోషిగా బయటికి వస్తారని బలంగా నమ్ముతున్నా.  ఈ కేసులో అసలైన దోషికి శిక్ష పడాలని కోరుకుంటున్నాను.’’ అంటూ నాగశౌర్య రాసుకొచ్చారు. 

Darsha.jpg

అయితే ఈ పోస్ట్‌కి నాగశౌర్య కామెంట్‌ బాక్స్‌ను క్లోస్‌ చేశారు. ఎందుకంటే కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో దర్శన్‌ అభిమానులకి  టాలీవుడ్‌ హీరోల అభిమానులకి వార్‌ జరుగుతోంది. దర్శన్‌ లాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ కొంతమంది తెలుగు హీరోల ఫ్యాన్స్  పోస్ట్‌లు పెడుతున్నారు. దీనిపై దర్శన ఫైర్‌ అయ్యారు. దీంతో టాలీవుడ్‌ హీరోల  ఫ్యాన్స  అంతా ఒకేసారి దర్శన్‌ అభిమానులపై సోషల్‌ మీడియాలో విరుచుకుపడ్డారు. ఇలాంటి సమయంలో టాలీవుడ్‌ హీరో నాగశౌర్య.. దర్శన్‌కి మద్దతు పలకడం ఆయన అభిమానులకి కూడా కాస్త ఆశ్చర్యం కలిగించింది. అందుకే కామెంట్‌ బాక్స్‌ ప్రైవసీలో పెట్టారని తెలుస్తోంది. 

Updated Date - Jun 28 , 2024 | 01:47 PM