జల్‌పల్లి మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత.. మరోసారి మనోజ్‌పై, మీడియాపై దాడి

ABN , Publish Date - Dec 10 , 2024 | 08:09 PM

మరోసారి మంచు మనోజ్‌పై మోహన్ బాబు దాడి చేశారు. మనోజ్ పైనే కాకుండా ఈసారి మీడియాపై కూడా విచక్షణారహితంగా మోహన్ బాబు దాడి చేశారు. అయ్యప్ప మాలలో ఉన్న ఓ విలేఖరి దగ్గర నుండి మౌక్ లాక్కొని అతనిపై దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

Attack on Media at Mohan Babu House

మరోసారి మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంచు మనోజ్, మౌనికలను మోహన్ బాబు ఇంటి సెక్యూరిటీ అడ్డుకుని గెట్లు వేయడంతో.. వారిద్దరూ గెట్లను బద్దలు కొట్టి మరీ లోనికి ప్రవేశించే ప్రయత్నం చేయగా.. సెక్యూరిటీతో మనోజ్ వాగ్వాదానికి దిగారు. విష్ణు తరపు బౌన్సర్లు మనోజ్ దంపతులను అడ్డుకోగా.. పోలీసులు ఆ బౌన్సర్లను బయటికి పంపించేసినట్లుగా తెలుస్తోంది. ఈలోపు ఈ ఘటనను కవరేజ్ చేస్తున్న మీడియాపై ఒక్కసారిగా మంచు మోహన్ బాబు విరుచుకుపడ్డారు. కొన్ని కెమెరాలను ధ్వంసం చేశారు. అంతేకాదు, మనోజ్ పై కూడా ఆయన దాడి చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా మోహన్ బాబు ఇంటి వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. మోహన్ బాబు విచక్షణారహితంగా చేసిన దాడితో.. ఆ ప్రదేశంలోని చాలా మంది గాయపడినట్లుగా సమాచారం.

Also Read-Big Twist: మోహన్ బాబు ఇంట్లోని పని మనిషి ఏం చెప్పిందంటే..

మంచు మనోజ్ గేట్లు తన్నుకుంటూ లోపలికి వెళ్లగా.. అతని వెంట మీడియా కూడా మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లింది. అయితే ఓ విలేఖరి దగ్గర మైక్ లాక్కున్న మోహన్ బాబు.. ఆ విలేఖరిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. పైగా ఆ విలేఖరి అయ్యప్ప మాలలో ఉన్నారు. అయ్యప్ప మాలలో ఉన్న విలేఖరిపై దాడి.. ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఇది మరింతగా రచ్చ అయ్యే అవకాశం లేకపోలేదు.


మరోవైపు ‘‘నా పిల్లలకి..నా ఫ్యామిలీ జోలికి వస్తే నేను ప్రైవేట్ కంప్లయింట్ వేస్తాను.. మీరు న్యాయంగా చెయ్యండి.. దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయ్.. కానిస్టేబుల్స్ మా సెక్యూరిటీని పంపించేశారు..’’ అంటూ మౌనిక మాట్లాడుతోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంగా అయితే మంచు ఫ్యామిలీలో పెద్ద యుద్ధమే నడుస్తోంది.

Also Read-Mohan Babu: అన్నదమ్ముళ్లులా కలిసి బ్రతకాలని కోరుకుంటే.. మోహన్ బాబు ట్వీట్ వైరల్

Also Read-Manchu Family: మనోజ్ హాస్పిటల్‌ల్లో.. మోహన్ బాబు ట్విట్టర్‌లో.. మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది?

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 10 , 2024 | 10:12 PM