Rithu Chowdary: మ‌రో ల‌గ్జ‌రీ కారు కొన్న.. రీతూ చౌద‌రి! ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదుగా

ABN , Publish Date - Jun 20 , 2024 | 02:06 PM

జ‌బ‌ర్ద‌స్త్ న‌టి, యాంక‌ర్‌ రీతూ చౌద‌రి తాజాగా ఓ ల‌గ్జ‌రీ కారును కొనుగోలు చేసి వార్త‌ల్లో నిలిచింది. ఇప్పుడు ఈ అమ్మ‌డి పేరు నెట్టింట బాగా హ‌ల్‌చ‌ల్ అవుతోంది.

Rithu Chowdary: మ‌రో ల‌గ్జ‌రీ కారు కొన్న.. రీతూ చౌద‌రి! ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదుగా
Rithu chowdary

రెండు తెలుగు రాష్ట్రాల కుర్ర‌కారుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు రీతూ చౌద‌రి (Rithu Chowdary). నిత్యం త‌న హాట్ ఫొటోషూట్లతో సోష‌ల్‌మీడియాలో మంట పెడుతూ యువ‌త‌కు నిద్ర‌ను కరువు చేస్తోంది. స‌మ‌యం దొరికితే చాలు కుర‌చ దుస్తుల్లో ఫొటోషూట్లు చేస్తూ టాలీవుడ్ హీరోయిన్ల‌ను త‌ల‌ద‌న్నేలా హోయ‌లు పోతూ త‌న అందాల‌ను ఆర‌బోస్తుంది.

ఈ మ‌ధ్య ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌లో ఇంట‌ర్వ్యూలు కూడా చేస్తూ.. త‌న డ‌బుల్ మీనింగ్ ప్రశ్న‌ల‌తో అంత‌కు మించి అనేలా పేరు సంపాదించింది. సామాజిక మాధ్య‌మాల్లో ట్రెండింగ్‌లో ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ కారును కొనుగోలు చేసి వార్త‌ల్లో నిలవ‌డ‌మే కాక ఈ అమ్మ‌డి పేరు నెట్టింట బాగా హ‌ల్‌చ‌ల్ అవుతోంది.

గ‌త సంవ‌త్స‌రం సొంతింటి క‌ల‌ను కూడా తీర్చుకున్న ఈ తెలుగందం ఇప్ప‌టికే మ‌హేంద్రా థార్ వంటి ఒక‌టి రెండు కార్లు ఉన్న ఈ చిన్న‌ది రీసెంట్‌గా మ‌రో కారును కొన‌డంతో కుర్ర‌దాని జోరు మాములుగా లేదుగా అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

24.jpg

రీతూ కొనుగోలు చేసిన కారు లగ్జరీ కారు పేరు ఇన్నోవా క్రిస్టా హైబ్రిడ్ హైక్రాస్ (Toyota Innova Hycross) కాగా బ‌హిరంగ మార్కెట్‌లో దాని ధ‌ర రూ.25. నుంచి 35 ల‌క్ష‌లకు వ‌ర‌కు ఉండ‌డం గ‌మ‌నార్హం.

Ritu_2_1718727232242_1718727242706.jpeg

రీతూ (Rithu Chowdary) ప్ర‌స్తుతం ఈ కారు డెలివ‌రీ కూడా తీసుకోని మొద‌టిసారిగా త‌న త‌ల్లితో క‌లిసి రైడ్ చేసింది. అందుకు సంబంధించిన‌ ఫొటోలు, పూజ దృశ్యాల‌ను త‌న ఇన్ స్టా అకౌంట్‌లో పోస్టు చేయ‌గా అవి బాగా వైర‌ల్ అవుతున్నాయి.


12.jpg

సీరియ‌ల్స్ ద్వారా అప్పుడ‌ప్పుడే పేరు తెచ్చుకుంటున్న రీతూ చౌద‌రి (Rithu Chowdary) జీ5లో స‌రిగ‌మ‌పా షోలో సింగ‌ర్ య‌శ‌స్వి పాడిన పాట‌కు మైమ‌రిచి అత‌న్ని అంద‌రిముందు కౌగిలించుకుని ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చింది.

ఆ త‌ర్వాత హైప‌ర్ ఆది సాయంతో జ‌బర్ద‌స్త్ లో ఎంట్రీ ఇచ్చి బాగా పాపుల‌ర్ అయింది. ఇక ఆ త‌ర్వాత సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌ టాలెంట్ అంతా చూయిస్తూ చాలా పొదుపుగా బ‌ట్ట‌ల‌ను ధ‌రిస్తూ యూత్‌ను టార్గెట్ చేసి అన‌తి కాలంలోనే మిలియ‌న్ పైనే ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకుంది. చూడాలి రీతూ మున్ముందు ఏ స్థాయిలో హంగామా చేస్తుందో.

Updated Date - Jun 20 , 2024 | 02:14 PM