Lal Salaam Trailer: ఇండియన్‌గా నేర్చుకోవాల్సింది అదే.. తలైవా డైలాగ్ వైరల్
ABN , Publish Date - Feb 07 , 2024 | 07:36 PM
మొయిద్దీన్ భాయ్ పాత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో సుభాస్కరణ్ నిర్మించారు. ఫిబ్రవరి 9న పాన్ ఇండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ లక్ష్మీ మూవీస్ గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
భారతదేశంలో ఎన్నో మతాలు, కులాల వాళ్లు.. ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా కలిసి మెలిసి ఆనందంగా జీవిస్తున్నారు. కానీ కొందరు స్వార్థ రాజకీయాలతో మనలో మనకు గొడవలు పెట్టారు. దీని వల్ల నష్టం జరిగింది. అయితే ఇలాంటి చెడు పరిమాణాల నుంచి ప్రజలను, దేశాలను కాపాడిన వారెందరో ఉన్నారు. అలాంటి ఓ హీరో మొయిద్దీన్ భాయ్. మొయిద్దీన్ భాయ్ పాత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) నటించిన చిత్రం ‘లాల్ సలామ్’ (Lal Salaam). ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌పై ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో సుభాస్కరణ్ నిర్మించారు. ఫిబ్రవరి 9న పాన్ ఇండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ లక్ష్మీ మూవీస్ గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘ఊర్లో ఒక్క మగాడు లేడా? ఊర్లో ఉన్నొళ్లందరినీ తీసుకెళ్లి బొక్కలే వేశారు’ అనే డైలాగ్‌తో ఇంటెన్స్ యాక్షన్‌తో ట్రైలర్ మొదలైంది. ఆ తరువాత ఊరి వాతావరణం, క్రికెట్ ఆట, జాతర సీన్లు, రాజకీయంతో ముడిపడ్డ సన్నివేశాలను చూపించారు. ‘మందిని కూడ బెట్టేవాడి కన్నా.. ఎవడి వెనకాల మంది ఉంటారో వాడే చాలా ప్రమాదకరం.. వాడ్ని ప్రాణాలతో వదిల పెట్టకూడదు’ అనే డైలాగ్ అనంతరం.. తలైవా రజనీకాంత్ ఎంట్రీ ట్రైలర్ రేంజ్‌ని మార్చేసింది. ‘బిడ్డ సంపాదిస్తే ఇంటికి గౌరవం.. బిడ్డ సాధిస్తే దేశానికే గౌరవం’, ‘మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో.. మానవత్వాన్ని అందరితో పంచుకో.. ఇండియన్‌గా నేర్చుకోవాల్సింది అదే’ అని తలైవా రజినీకాంత్ చెప్పే డైలాగ్స్ సినిమాపై అంచనాలను రేకెత్తిస్తున్నాయి. (Lal Salaam Trailer)
ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాలో కథ ఎలా ఉండబోతోందో అర్థం అవుతుంది. ఊరు.. ఊర్లోని రకరకాల మతాలకు చెందిన మనుషులు, రాజకీయ నాయకులు, క్రికెట్, మత ఘర్షణల మధ్య మొయిద్దీన్ భాయ్ రాక వంటి అంశాలు.. చూస్తుంటే.. ఐశ్వర్య రజనీకాంత్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారనేది తెలుస్తోంది. రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలలో నటించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
====================
*Vishal: పొలిటికల్ ఎంట్రీ, నూతన పార్టీ వార్తలపై విశాల్ ఏమన్నారంటే..
***********************
*Kiran Abbavaram: కొత్త దర్శకుడితో కిరణ్ అబ్బవరం.. టైటిల్ ఫిక్స్
**************************
*RRR: జక్కన్నపై మరోసారి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ప్రశంసలు
******************************