Simbu and Varalaxmi: శింబుతో వరలక్ష్మీ శరత్‌కుమార్ పెళ్లి.. వారిద్దరూ ఎలా రియాక్ట్ అయ్యారంటే?
ABN , Publish Date - Feb 02 , 2024 | 09:08 PM
కోలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిలర్ హీరో, హీరోయిన్ల జాబితాలో శింబు, వరలక్ష్మి శరత్‌కుమార్ ఉన్నారు. అయితే, వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ మూడు నాలుగు రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై తాజాగా ఈ ఇద్దరు రియాక్ట్ అయ్యారు. మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే.. మా పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు అంటూ ఇద్దరూ పెళ్లి వార్తలని ఖండించారు.
కోలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిలర్ హీరో, హీరోయిన్ల జాబితాలో శింబు (Simbu), వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarath Kumar) ఉన్నారు. అయితే, వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ మూడు నాలుగు రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. గతంలోనూ వీరిద్దరిపై ఇలాంటి వార్తలే వచ్చాయి. దీనికి బలమైన కారణం లేకపోలేదు. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా కలిసి నటించడం, సినీ నేపథ్యం కలిగిన కుటుంబాలకు చెందిన వారు కావడం, పైగా వీరి తల్లిదండ్రులు మంచి స్నేహితులవడంతో ఈ వార్తలు నిజమై ఉంటాయని భావించారు. పైగా, శింబు పుట్టిన రోజైన ఫిబ్రవరి 3న శుభవార్తను వెల్లడిస్తానని ప్రకటించారు. దీంతో వరలక్ష్మితో పెళ్లి గురించిన ప్రకటనే అయ్యింటుందని అంతా భావించారు. ఈ నేపథ్యంలో శింబు, వరలక్ష్మి ఈ వదంతులపై వేర్వేరుగా స్పందించారు.
‘నేను, వరలక్ష్మి మంచి స్నేహితులం. నేను ఆమెను వివాహం చేసుకోవడం లేదు’ అంటూ శింబు స్పష్టం చేస్తే.. ‘శింబుకు నాకు పెళ్లి జరగడం లేదు. అతను నా స్నేహితుడు’ అని వరలక్ష్మి శరత్‌కుమార్ క్లారిటీ ఇచ్చారు. దీంతో శింబు, వరలక్ష్మీ శరత్ కుమార్‌ల పెళ్లి అనే వదంతులకు ఫుల్‌స్టాఫ్ వారిద్దరే పెట్టేశారు. ఇక వీరిద్దరూ నటులుగా బిజీబిజీగా ఉన్నారు. రీసెంట్‌గా వచ్చిన ‘హను-మాన్’ (Hanu-Man) సినిమాతో వరలక్ష్మీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకుంటే.. కాస్త గ్యాప్ తర్వాత శింబు హీరోగా వరస సినిమాలు చేస్తున్నారు. శింబు హీరోగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మించనున్న చిత్ర ఫస్ట్ లుక్‌ని తాజాగా విడుదల చేశారు.
ఇక పెళ్లి అనే విషయంలోకి వస్తే.. వీరిద్దరి విషయంలోనూ పెళ్లి వార్తలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా శింబు విషయంలో నిశ్చితార్థం (Engagement) వరకు వెళ్లి.. పెళ్లి ఆగిపోయిన రోజులున్నాయి. హీరోయిన్ హన్సిక (Hansika)తో శింబు పెళ్లి వ్యవహారం ఏమైందో అందరికీ తెలిసిందే. అలాగే ఇంకో ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు కూడా శింబు విషయంలో ఆ మధ్య బాగా వినిపించాయి. వరలక్ష్మి విషయానికి వస్తే హీరో విశాల్ (Vishal)తో ఆమె పెళ్లి కూడా దాదాపు పీటల వరకు వెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు కొత్తగా శింబు అంటూ ప్రచారాలు మొదలయ్యాయి. అయితే ఇద్దరూ వెంటనే స్పందించి.. ఆదిలోనే ఈ వార్తలకు బ్రేక్ వేశారు.
ఇవి కూడా చదవండి:
====================
*‘లాల్‌సలాం’కు ధన్య బాలకృష్ణ రూపంలో చిక్కులు?.. సారీ చెప్పిన నటి..!
***************************
*HanuMan: 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా రికార్డ్
****************************
*Family Star: ‘దేవర’ డేట్‌కే ఫిక్సయిన ‘ఫ్యామిలీ స్టార్’.. అయోమయంలో తారక్ ఫ్యాన్స్
*****************************
*Gaddar Awards: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దర్ అవార్డ్స్‌పై మంచు మోహన్ బాబు స్పందనిదే..
*************************