Samyuktha: సంయుక్త కూడా ఇప్పుడు స్టార్ట్ చేసేసింది

ABN , Publish Date - Jul 15 , 2024 | 01:44 PM

తెలుగులో వరస విజయాలతో దూసుకుపోతున్న మలయాళీ నటి సంయుక్త ఇప్పుడు హిందీ పరిశ్రమలోకి కూడా అడుగుపెడుతోంది. ఇటు దక్షిణాది భాషల్లో, అటు హిందీలో బిజీగా వున్న నటీమణుల్లో చేరిపోయిన సంయుక్త తాజా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి

Samyuktha

మలయాళం సినిమా 'పాప్ కార్న్' తో చిత్ర పరిశ్రమలో 2016లో అరంగేట్రం చేసిన మలయాళీ నటి సంయుక్త. తరువాత మళయాళంలోనే ఎక్కువగా సినిమాలు చేసింది, మధ్యలో 'కలరి' అనే ఒక తమిళ సినిమా కూడా చేసింది. మలయాళంలో మంచి నటి అని నిరూపించుకుంది సంయుక్త. (Sir fame Samyuktha pictures goes viral)

samyukthanewa.jpg

2021లో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిలు నటించిన 'భీమ్లా నాయక్' సినిమాతో తెలుగులో ప్రవేశించింది. ఆ సినిమాలో రానా దగ్గుబాటి భార్యగా నటించింది. ఈ సినిమా మలయాళం హిట్ సినిమా 'అయ్యప్పనం కోషియం' కి రీమేక్. తెలుగు సినిమాకి సాగర్ చంద్ర దర్శకుడు, అయితే ఆసక్తికరం ఏంటంటే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించటం. ఈ సినిమాలో సంయుక్త అందరి దృష్టిని ఆకర్షించింది. (Latest photos of Samyuktha)

తరువాత రెండో సినిమా కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా వచ్చిన 'బింబి సార' సినిమాలో కథానాయికగా నటించింది. మల్లిడి వశిష్ట దర్శకుడు, ఈ సినిమా పెద్ద విజయం సాధించటంతో సంయుక్త తెలుగు సినిమాలపై పట్టు సాధించింది.

samyukthanewb.jpg

మూడో సినిమా సంయుక్తకి చాలా పెద్ద సినిమా. తమిళ నటుడు ధనుష్ పక్కన కథానాయికగా 'సర్' అనే తెలుగు సినిమాలో నటించింది. ఇది తమిళంలో కూడా 'వాతి' పేరుతో ఒకేసారి విడుదలైంది. ఇందులోని 'మాస్టారూ... మాస్టారూ...' పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసింది. ఇలా వరసగా మూడు సినిమాలలో కథానాయికగా విజయం సాధించిన సంయుక్త తెలుగులో అనతి కాలంలో అగ్ర నటీమణుల్లో చేరిపోయింది. (Virupaksha heroine Samyuktha photos goes viral)

samyukthanewc.jpg

ఒక్క తెలుగు సినిమాలే కాకుండా, కన్నడ, తమిళం, మలయాళం సినిమాలు చేసుకుంటూ వస్తున్న సంయుక్తకి ఇంకో పెద్ద విజయం తెలుగులో లభించింది. అదే 'విరూపాక్ష'. సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో సంయుక్త కథానాయకురాలిగా ఒక విభిన్నమైన పాత్రలో కనపడుతుంది. ఇలా వరస విజయాలతో దూడుకుతూ వెళుతున్న సంయుక్త ఇప్పుడు హిందీ సినిమా కూడా చేస్తోంది. (Dhanush heroine pictures goes viral now)

samyukthanewd.jpg

చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ హిందీ సినిమా పేరు 'మహారాగ్ని: క్వీన్ అఫ్ క్వీన్స్'. ఇందులో కాజోల్, ప్రభు దేవా, నసీరుద్దీన్ షా, జిషు సేన్ గుప్త లాంటి నటులు వున్నారు. ఈ సినిమాతో సంయుక్త హిందీ పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. మలయాళం నుండి తమిళ్, తెలుగు, కన్నడ ఇప్పుడు హిందీలో చేస్తున్న సంయుక్త ఇలా అన్నీ భాషల్లో బిజీ అయిపోతోంది.

samyukthanewe.jpg

ఇవే కాకుండా నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియడ్ డ్రామా 'స్వయంభు' సినిమాలో కూడా సంయుక్త ఒక ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాకి భరత్ కృష్ణమాచారి దర్శకుడు.

Updated Date - Jul 15 , 2024 | 01:44 PM