Samantha: సమంత ఇంట్లో విషాదం.. ఆమె తండ్రి మృతి

ABN , Publish Date - Nov 29 , 2024 | 04:58 PM

స్టార్ హీరోయిన్ సమంత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు. ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టా స్టోరీలో తెలియజేశారు.

Samantha and Her Father Joseph Prabhu

స్టార్ హీరోయిన్ సమంత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు. ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టా స్టోరీలో తెలియజేశారు. ‘నాన్నను ఇక కలవలేను’ అంటూ ఆమె హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేశారు. దీంతో సమంతకు అభిమానుల, సెలబ్రిటీలు సానుభూతిని తెలియజేస్తూ.. ఈ సమయంలో ధైర్యంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read- Sankranthi: రామ్ చరణ్, బాలయ్యలకు పోటీగా సంక్రాంతి బరిలోకి మరో స్టార్ హీరో చిత్రం..


సమంత చెన్నైలో జోసెఫ్ ప్రభు, నీనెట్ ప్రభు దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి తెలుగు ఆంగ్లో-ఇండియన్. సమంత జీవితంలో ఆమె తండ్రి ముఖ్య పాత్ర పోషించారని గతంలో ఎన్నోసార్లు ఆమె చెప్పుకొచ్చింది. తనకు ప్రతి క్షణం తన తండ్రి అండగా, మద్దతుగా నిలిచారని తెలిపింది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మరణవార్త తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తూ.. జోసెఫ్ ప్రభు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. అయితే జోసెఫ్ ప్రభు మరణవార్తకు కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది.


Samantha-PIc.jpg

కొన్నాళ్లుగా సమంతకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ప్రేమించి, పెళ్లి చేసుకున్న నాగ చైతన్య నుంచి విడాకులు, ఆ తర్వాత మయోసైటిల్ వ్యాధితో ఇబ్బంది పడుతూ, దాని చికిత్స నిమిత్తం సినిమాలకు సైతం దూరంగా ఉన్న సమంత.. ఈ మధ్యనే మళ్లీ కాస్త రికవరీ అయినట్లుగా కనిపిస్తోంది. అయినప్పటికీ ఏదో పోగొట్టుకున్నట్లుగానే ఆమె అంతకు ముందులా స్వేచ్ఛగా ఉండలేకపోతుంది. మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా చాలా దిగులుగానే ఉంటుంది. మధ్యలో నెటిజన్ల పోస్ట్‌లు ఆమెను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నా.. ధైర్యంగా ముందుకు వెళుతూనే ఉంది. ఇలాంటి సమయంలో తనకు మొదటి నుండి ఎంతో ధైర్యాన్ని ఇచ్చిన తండ్రి కూడా దూరమవడం నిజంగా బాధాకరం. సమంతకే ఎందుకిలా జరుగుతుందో మరి. ఏదిఏమైనా ఈ కష్ట సమయంలో ఆమె ధైర్యంగా ఉండాలని ఆమె సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నారు.

Samantha-post.jpg

Also Read-Chai Sobhita: డోల్ డోల్ డోల్ భాజే.. అక్కినేని ఇంట్లో సంబరాలే

Also Read-Prashanth Varma: సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే.. గెట్ రెడీ ఫర్ 'మోక్ష‌జ్ఞ'

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 29 , 2024 | 05:25 PM