Mathu Vadalara 2: రియా ఎవరో తెలిసిపోయింది.. ఇక ఆపేయండి

ABN , Publish Date - Oct 19 , 2024 | 11:43 AM

‘మత్తువదలరా 2’ సినిమాలో సత్య చేసిన కామెడీకి జనాలంతా కడుపుబ్బా నవ్వుతున్నారు. ఇందులోని కామెడీ సీన్స్ ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. 'రియా ఎవరు అంటూ 'సత్య, అజయ్ మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ రియా ఎవరంటే..

శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో రితేష్ రానా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిలేరియస్ థ్రిల్లర్ ‘మత్తువదలరా2’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 13న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో డీసెంట్ హిట్ సాధించింది. కాగా ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో సత్య చేసిన కామెడీకి జనాలంతా కడుపుబ్బా నవ్వుతున్నారు. ఇందులోని కామెడీ సీన్స్ ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. 'రియా ఎవరు అంటూ 'సత్య, అజయ్ మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ రియా ఎవరంటే..


ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ప్రత్యేక్షమయ్యే సన్నివేశం 'రియా ఎవరు.' మొదట సత్య రియా ఎక్కడ అని ప్రశ్నిస్తే.. అజయ్ రియా ఎవరిని అడుగుతాడు. దీనికి సత్య దామిని డాటర్ అంటూ సమాధానమియ్యగా, అజయ్ దామిని ఎవరు అని ప్రశ్నిస్తాడు. దీనికి సత్య రియా మదర్ అని ఆన్సర్ చేస్తాడు. దీంతో అజయ్ రియా, దామిని ఎవరు అని ప్రశ్నిస్తే.. సత్య మదర్ & డాటర్ అని రిప్లై ఇస్తాడు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వీపరీతంగా వైరల్ అవుతుంది. యాక్టర్ అజయ్‌కి రియా ఎవరు అంటూ మెసేజ్ అండ్ కాల్స్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాలో రియా ఎవరో.. ఆ క్యారెక్టర్ ప్రసక్తి కూడా తీసుకు రాలేదు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాకి విపరీతమైన ఊహించని స్థాయిలో ఫ్రీ ప్రమోషన్ లభించటంతో నెట్‌ఫ్లిక్స్ ఫుల్ ఖుషి అయిపోతుంది. మరోవైపు ఈ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ రియా అంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో ని పోస్ట్ చేశారు. గతంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన రామ్ చరణ్ 'బ్రూస్ లీ' సినిమాలో రకుల్ రియా అనే పాత్రా పోషించింది. దీంతో 90% కేసును సాల్వ్ చేశావ్ కదయ్యా అంటూ డీవీవీ నిర్మాణ సంస్థ పోస్ట్ కింద క్రేజ్ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు ఈ సినిమాలో సత్య చేసిన పదహారేళ్ళ వయసు, నేను గాలిగోపురం నీవు ప్రేమ పావురం సాంగ్స్ కూడా వీపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Updated Date - Oct 19 , 2024 | 11:43 AM