Regina cassandra: రెజీనాకు ఆ పేరు ఎలా వచ్చిందంటే...
ABN , Publish Date - Dec 31 , 2024 | 09:09 AM
సినీ పరిశ్రమలో కుల, మతాంతర వివాహాలు ఆపై వాటి నుంచి వచ్చే సమస్యలు వంటి కథలతో చాలా చిత్రాలొచ్చాయి. నిజ జీవితంలోనూ ఈ విధానం ఎప్పటి నుంచో కొనసాగుతోంది.
సినీ పరిశ్రమలో కుల, మతాంతర వివాహాలు ఆపై వాటి నుంచి వచ్చే సమస్యలు వంటి కథలతో చాలా చిత్రాలొచ్చాయి. నిజ జీవితంలోనూ ఈ విధానం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. చాలామంది ప్రముఖులు మతాంతర వివాహాలు చేసుకుంటున్నారు. నటి రెజీనా (Regina Cassandra)కుటుంబంలో కూడా ఇలాంటి ఘటనే ఉంది. రెజీనా తెలుగులోనే కాదు తమిళ, మలయాళ, కన్నడ హిందీ భాషల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పలు చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లోనూ సందడి చేశారు. తాజాగా వెబ్ సిరీసుల్లోనూ మెరిసింది. ప్రస్తుతం అజిత్ కథానాయకుడిగా నటించిన 'విడాముయర్చి’ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించారు. తాజాగా మతం గురించి ప్రస్తావన రాగా రెజీనా ఇలా స్పందించారు.
"పుట్టినప్పుడు ఇస్లాం మతస్తురాలిగా ఉన్నా. తర్వాత క్రిస్టియన్ మతానికి మారాను. ఎందుకంటే నా తల్లి క్రిస్టియన్ మతానికి చెందిన వారు. తండ్రి ఇస్లాం మతస్తులు. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పుట్టినప్పుడు నేను ఇస్లాం మతస్తురాలిగా పెరిగాను. ఆరేళ్ల వయసులో ఉండగా అమ్మానాన్న విడిపోయారు. అప్పుడు అమ్మ తిరిగి క్రిస్టియన్‌గా కన్వర్ట్ అయ్యి రెజీనా పేరుకు ‘కసాండ్రా’ జత చేశారు’’ అని అన్నారు. దీంతో తాను బాప్తిజం పొంది బైబిల్ చదివినట్లు చెప్పారు. అలా ఆమె రెజీనా కసాండ్రా గా మారింది. తన అసలు రెజీనా పేరు రెజీనా అని తెలిపింది. మతం విషయంలో తనకు ఎలాంటి పట్టింపులు లేవని, చర్చి, మసీద్, గుడి.. ఇలా ఎక్కడికైనా వెళ్తానని కూడా చెప్పారు.
Read Also: Yash: అభిమానులకు ‘కెజియఫ్’ స్టార్ సంచలన లేఖ
Nidhhi Agerwal: 2025 సంవత్సరం మాత్రం నిధి అగర్వాల్‌దే!