Game Changer: ‘గేమ్ చేంజర్’ యూనిట్‌కు రామ్ చరణ్ ఫ్యాన్ వార్నింగ్
ABN , Publish Date - Dec 28 , 2024 | 08:14 PM
‘గేమ్ చేంజర్’ మూవీ ట్రైలర్ రిలీజ్ అప్డేట్ ఇవ్వకపోతే, న్యూ ఇయర్ రోజు ట్రైలర్ విడుదల చేయకపోతే.. ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ అభిమాని సినిమా టీమ్‌కు లెటర్ రాశాడు. దీంతో ఒక్కసారిగా టీమ్ అలెర్ట్ అయింది. సదరు అభిమానికి రామ్ చరణ్ పీఆర్ టీమ్ ద్వారా వివరణ ఇప్పించి.. శాంతింపజేశారు. వివరాల్లోకి వెళితే..
ఫ్యాన్స్ నందు డై హార్డ్ ఫ్యాన్స్ వేరయా అని నిరూపించాడో అభిమాని. తన అభిమాన నటుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా ట్రైలర్ అప్డేట్ కనుక ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ లేఖను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడో వీరాభిమాని. ఇప్పుడా లెటర్ వార్తలలో హైలెట్ అవుతోంది. అయితే కాసేపటికే ఆ అభిమాని ఆ ట్వీట్‌ని డిలీట్ చేశాడు. అభిమాని లెటర్‌పై ‘గేమ్ చేంజర్’ పీఆర్ టీమ్ వెంటనే స్పందించి.. సదరు అభిమానికి వివరణ ఇచ్చారు. వెంటనే ఆ అభిమాని తన ట్వీట్‌ని తొలగించి, పీఆర్ ఇచ్చిన మెసేజ్‌ని రీ ట్వీట్ చేశారు. దీంతో రెండు రకాల వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లయింది.
Also Read-Pawan Kalyan: అల్లు అర్జున్ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ ఎలా స్పందించారంటే..
అందులో మొదటి రకం వార్త ఏమిటంటే.. నిజంగా అభిమాని అభిమానంతో అలా చేసి ఉంటే.. అతడిని ఆత్మహత్య చేసుకోనీయకుండా పీఆర్ టీమ్ సేవ్ చేసిందని చెప్పుకోవచ్చు. రెండో రకం వార్త ఏమిటంటే.. కావాలనే చిత్రయూనిట్ ఇలా అభిమానితో చేయించిందనే అపవాదుని కూడా పీఆర్ టీమ్ ఎర్లీ స్పందనతో దూరం చేసింది. లేదంటే ఈ సరికే సోషల్ మీడియాలో మెగా వ్యతిరేక వర్గం డ్యూటీ ఎక్కేసేది. వాస్తవానికి ‘గేమ్ చేంజర్’ టీమ్ ఈ మధ్య అలెర్ట్‌గానే ఉంది.. అప్డేట్స్ వదులుతూనే ఉంది. అయినా కూడా అప్డేట్స్ అంటే.. ఎక్కడి నుండి తీసుకొస్తారు. అదే చెప్పారు పీఆర్ టీమ్ కూడా. సమయం వచ్చినప్పుడు అన్ని వస్తుంటాయి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అంటూ, ఆత్మహత్య చేసుకుంటానని లెటర్ వదిలిన వ్యక్తికి టీమ్ సర్దిచెప్పింది. ఇంతకీ ఆ అభిమాని రాసిన లెటర్‌లో ఏముందంటే..
‘‘సినిమా రిలీజ్‌కు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. మీరు ఏ విధమైనటువంటి ట్రైలర్ అప్డేట్ ఇవ్వట్లేదు. కనీసం అభిమానుల ఎమోషన్స్‌ని పట్టించుకోవట్లేదు. ఈ నెలా ఆఖరు కల్లా మీరు ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే, న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ విడుదల చేయకపోతే.. నేను ఆత్మహత్యకు పాల్పడతానని సవినయంగా తెలియజేసుకుంటున్నాను.. ఇట్లు మీ విధేయుడు, చరణ్ అన్న భక్తుడు’’ అని గేమ్ చేంజర్ యూనిట్‌కు సదరు అభిమాని లెటర్ రాశాడు. ఈ లెటర్‌కి నెటిజన్లు కూడా తలోరకంగా రియాక్ట్ అయ్యారు. కొందరు ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే.. మరికొందరు, ఇలా చేసే అల్లు అర్జున్ జైలుకి పోయేలా చేశారు అంటూ కౌంటర్స్ వేస్తున్నారు.