Raj Tharun:ఆ అమ్మాయి వేరే అబ్బాయితో రిలేషన్లో ఉంది
ABN , Publish Date - Jul 05 , 2024 | 03:54 PM
సినీ నటుడు రాజ్ తరుణ్ (Raj tharun)తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య (Lavanya) అనే యువతి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే
లావణ్య డ్రగ్స్ కి బాగా ఎడిక్ట్ అయింది..
ఎన్ని సార్లు వారించినా వినలేదు..
మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది...
నాతోపాటు నా చుట్టూ ఉన్నవాళ్లను భయపెడుతోంది..
ఆ టార్చర్ తట్టుకోలేక బ్రేకప్ చెప్పా
మీడియాతో రాజ్ తరుణ్
సినీ నటుడు రాజ్ తరుణ్ (Raj tharun)తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య (Lavanya) అనే యువతి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై రాజ్‌తరుణ్ స్పందించారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. "గత ఏడేళ్లగా లావణ్యతో రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే. అయితే ఆమె అలవాట్లు నచ్చక దూరం పెట్టాను. ఆమె డ్రగ్స్‌కు ఎడిక్ట్ అయింది. మస్తాన్ అనే వ్యక్తితో విలేషన్ లో ఉంది. ఎన్నోసార్లు చెప్పి చూశాను. నా మాట వినలేదు. కొన్నాళ్లగా నాకైతే టార్చర్ చూపిస్తోంది. అవన్నీ తట్టుకోలేకే ఆమెకు దూరంగా ఉంటున్నా. రిలేషన్ కు స్వస్తి చెప్పాను. అప్పటి నుంచి నన్ను బెదిరించసాగింది. నాతో డైరెక్ట్‌గా మాట్లాడకుండా నా చుట్టూ ఉన్న స్నేహితులను ఇబ్బంది పెడుతుంది. కేసు పెడతానని బెదిరిస్తోంది. దాంతో నేను లీగల్‌గా వెళ్లాలనుకుంటున్న విషయం తెలుసుకుని నాపై కేసు పెట్టింది. త్వరలో సినిమా రిలీజ్‌కు ఉండడంతో ఈ సినిమాను దెబ్బ తీయాలనే ఇప్పుడు ఆమె బయటకు వచ్చింది. (Drugs case)
బాధ్యతగల హీరోగా నేను ఆ పని చేయాల్సింది..
లావణ్య డ్రగ్స్ తీసుకుంటుందనే విషయాన్ని ఒక బాధ్యతగ గల హీరోగా నేను పోలీసులకు చెప్పాల్సింది. కానీ నేను నా రిప్యుటేషన్ పోతుందని ఆలోచించి ఆ దిశగా అడుగేయలేదు. ఎలాంటి రచ్చ జరుగుతోందోనని భయపడ్డాను. నన్ను చాలాకాలంగా బెదిరిస్తోందనే కారణంతో సైలెంట్‌గా ఉన్నా. లేదంటే నేను ఎప్పుడో పోలీసులు, మీడియా ముందుకు వచ్చేవాడిని. ఆమె నుంచి నాకు, నా స్నేహితులకు ఇబ్బంది ఉంది కానీ.. ఆమె తల్లిదండ్రుల నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆమెను పెళ్లి చేసుకుంటే బాగానే ఉంటుందని మనసులో ఉండేది. కానీ నేను ఎప్పుడు ఆ మాట ఆమెతో చెప్పలేదు. బంధం బలపడుతున్న సమయంలో డ్రగ్స్ , వేరే వ్యక్తితో రిలేషన్ తో పాటు చాలా కారణాల వల్ల నేను ఆమెకు దూరమయ్యా’’ అని చెప్పారు.