OG: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’పై వార్తలు వైరల్.. చేతులు మారాయని.. ట్రెండ్ సెట్టర్ అని!

ABN , Publish Date - Jan 07 , 2024 | 09:27 PM

సడెన్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తోన్న ‘ఓజీ’పై వార్తలు వైరల్ అవుతున్నాయి. OG ట్యాగ్‌ కూడా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా రెండు రకాల వార్తలు ‘ఓజీ’ గురించి సోషల్ మీడియా మాట్లాడుకునేలా చేస్తున్నాయి. అందులో ఒకటి ఈ ప్రాజెక్ట్ చేతులు మారాయనే రూమర్ అయితే.. రెండోది తిరుగులేని ట్రెండ్ సెట్టింగ్ మూవీ ఇదనేలా నటుడు వెంకట్ ఓజీ గురించి చెబుతున్న వీడియోతో.. ఓజీ ట్రెండ్ షేకవుతోంది.

OG: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’పై వార్తలు వైరల్.. చేతులు మారాయని.. ట్రెండ్ సెట్టర్ అని!
Pawan Kalyan In OG

సడెన్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తోన్న ‘ఓజీ’పై వార్తలు వైరల్ అవుతున్నాయి. OG ట్యాగ్‌ కూడా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా రెండు రకాల వార్తలు ‘ఓజీ’ గురించి సోషల్ మీడియా మాట్లాడుకునేలా చేస్తున్నాయి. అందులో ఒకటి చేతులు మారాయనే న్యూస్ అయితే.. రెండోది తిరుగులేని ట్రెండ్ సెట్టింగ్ మూవీ ఇదనేలా.. ఒకటే వార్తలు. మొదటి రకం వార్త విషయానికి వస్తే..

ఈ సినిమాని మొదటి నుండి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్.. ఇప్పుడు వేరొక సంస్థకి అప్పగించేసిందట. ఆ సంస్థ ఏదో కాదు.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. డీవీవీ సంస్థ పీపుల్ మీడియాకు ఈ సినిమాను ఇచ్చేసిందని, ఇకపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘ఓజీ’ సినిమాను నిర్మిస్తుందనేలా ఓ వార్త సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. అయితే అలాంటిదేమీ లేదనేలా కూడా మరో వార్త వచ్చేసిందనుకోండి. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో కూడా ఇలాగే వార్తలు వచ్చాయి. ‘బాహుబలి’ నిర్మాణ సంస్థ ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాణ సంస్థ అయిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు.. ఉన్నపళంగా ఆ సినిమాని ఇచ్చేయాలని భారీ అమౌంట్ ఆఫర్ చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అది ఫేక్ వార్తగా కొట్టేశారు. ఇప్పుడు ‘ఓజీ’ విషయంలోనూ అలాగే వార్తలు వైరల్ అవుతుండటం గమనార్హం.


Pawan.jpg

ఇక రెండో వార్త విషయానికి వస్తే.. ఈ సినిమాలో హీరో వెంకట్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట. తాజాగా ఆయన ఓ క్యాలెండర్ లాంచ్ ఈవెంట్‌కి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ‘ఓజీ’ గురించి మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి ‘అన్నయ్య’ సినిమా నుండే పవర్ స్టార్‌తో పరిచయం ఉందని, 23 ఏళ్ల తర్వాత పవర్ స్టార్‌తో వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని వెంకట్ చెప్పుకొచ్చారు. ఓజీ సినిమాని సుజీత్ ఓ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడని, తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా అవుతుందని, టాలీవుడ్‌లో ఒక ట్రెండ్ సెట్టర్ మూవీగా ‘ఓజీ’ నిలిచిపోతుందని వెంకట్ తెలిపారు. వెంకట్ ‘ఓజీ’ గురించి చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంగా అయితే.. కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న ‘ఓజీ’ మళ్లీ ట్రెండ్‌ని షేక్ చేస్తోంది. అన్నట్లు.. ఈ సినిమాకు సంబంధించి ఇంకా రెండు షెడ్యూల్స్ షూట్ మిగిలి ఉందట. ఫిబ్రవరిలో ఒక షెడ్యూల్ మొదలవుతుందని అంటున్నారు. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదల ఉంటుందనేలా వార్తలు వినబడుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

====================

*Guntur Kaaram: ‘కీర్తికిరీటాలు’ నవలతో ‘గుంటూరు కారం’ పోలిక.. నాగవంశీ రియాక్షన్ ఇదే..

*************************

*కెప్టెన్‌ నివాసానికి క్యూకడుతున్న సినీ ప్రముఖులు.. ఇప్పుడెందుకు వస్తున్నారంటూ..?

*************************

*Anjali: ముద్దుగా కనిపించినా.. నా పనులు అలా ఉంటాయి

***********************

*Director Vijay Binni: ‘నా సామిరంగ’లో చాలా సర్‌ప్రైజ్‌లున్నాయ్..

**************************

Updated Date - Jan 07 , 2024 | 09:27 PM