Ap Cm Oath Ceremony: జూనియర్ ఎన్టీఆర్‌కు అందని ఆహ్వానం..

ABN , Publish Date - Jun 11 , 2024 | 09:19 PM

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయబోతోన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నట్లుగా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వారికి కూడా ఆహ్వానం అందినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఈ వార్తలలో నిజం లేదని తెలుస్తోంది.

Ap Cm Oath Ceremony: జూనియర్ ఎన్టీఆర్‌కు అందని ఆహ్వానం..
Jr NTR And Chandrababu Naidu

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) బుధవారం ప్రమాణ స్వీకారం (AP Cm Oath ceremony) చేయబోతోన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హాజరుకానున్నట్లుగా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విశిష్ట అతిథిగా హాజరు కావాలని కోరుతూ చిరంజీవికి చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. దీంతో మంగళవారం సాయంత్రం 5 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడకు వెళ్లారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), అల్లు అర్జున్ (Allu Arjun) వంటి వారికి కూడా ఆహ్వానం అందినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఈ వార్తలలో నిజం లేదని తెలుస్తోంది.

Also Read- Kalki 2898 AD: ‘చూసుకోవాలి కదమ్మా’ అంటూ దీపికా పదుకొణె డబ్బింగ్ పై ట్రోల్స్

జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లకు ఆహ్వానం అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కొందరు వార్తలు వైరల్ చేస్తున్నారు. కొందరు ఊహాగానాలను ప్రచారం చేస్తున్నారు. కానీ అధికారికంగా ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్‌కు ఎటువంటి ఆహ్వానం అందలేదని (No Invitation to Jr NTR).. ఎన్టీఆర్ టీమ్ ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ (Devara) షూటింగ్ నిమిత్తం గోవాలో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ మాత్రమే కాదు.. అల్లు అర్జున్ (No Invitataion to Allu Arjun) విషయంలో కూడా ఇదే మాట వినిపిస్తోంది. ఫ్యాన్స్ కొందరు కావాలని అల్లు అర్జున్‌కు కూడా ఆహ్వానం అని ప్రచారం చేస్తున్నారు తప్పితే.. అధికారికంగా బన్నీకి ఎటువంటి ఆహ్వానం రాలేదని సమాచారం.


Chiru.jpg

ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవితో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్‌ (Super Star Rajinikanth) కూడా ఇప్పటికే విజయవాడ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రజినీకాంత్‌తో కలిసి వెళుతున్నట్లుగా జనసేన ఎంపీ బాలశౌరి ఇప్పటికే కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అలాగే రామ్ చరణ్‌ (Ram Charan)కు అధికారికంగా ఈ వేడుకకు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. హీరో నిఖిల్‌కు కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం వచ్చినట్లుగా సమాచారం. చీరాల ఎమ్మెల్యేగా గెలిచిన మాలకొండయ్య.. హీరో నిఖిల్‌కు మామయ్య అనే విషయం తెలిసిందే. ఆయన కోసం ఎన్నికల సమయంలో నిఖిల్ రోడ్ షో కూడా చేశారు.

Updated Date - Jun 11 , 2024 | 09:45 PM