Niharika Konidela: ఆకుపచ్చ డ్రెస్ లో నిహారిక ఎంత అందంగా వుందో చూశారా!

ABN , Publish Date - Jul 30 , 2024 | 06:48 PM

అటు చెన్నైలో తమిళ సినిమా చిత్రీకరణలో పాల్గొంటూ, ఇటు హైదరాబాదులో తను నిర్మాతగా తీస్తున్న 'కమిటీ కుర్రోళ్ళు' ప్రచారాల్లో బిజీగా ఉంటూ, నటిగా, నిర్మాతగా రెండిటినీ బాలన్స్ చేసుకుంటూ వస్తున్న నిహారిక, సామాజిక మాధ్యమాల్లో కూడా చురుకుగా ఉంటూ వుంటారు. ఆమె పోస్ట్ చేసిన తాజా ఫోటోలు వైరల్ అవుతున్నాయి

Niharika Konidela

నిహారిక కొణిదెల ఇటు నటిగా, అటు నిర్మాతగా బిజీ బిజీగా వుంటున్నారు. తమిళ సినిమా 'మద్రాస్కరణ్' లో ఒక ముఖ్యమైన పాత్రలో నిహారిక కనిపించనున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనడానికి నిహారిక ఒక పక్క చెన్నై వెళుతూ, ఇంకో పక్క తను నిర్మాతగా తీస్తున్న తెలుగు సినిమా 'కమిటీ కుర్రోళ్ళు' ప్రచారాల కోసం హైదరాబాదులో జరిగిన ఈవెంట్ లో పాల్గొన్నారు.

niharikakonidelalatest.jpg

అలాగే మధ్య మధ్యలో తన ఇన్స్టాగ్రామ్ లో కొత్త కొత్త ఫోటోలతో దర్శనం ఇస్తూ, అభిమానులకి కనువిందు కూడా చేస్తూ వుంటారు. 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా ఆగస్టు 9న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది, దానికి సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిధిగా వచ్చాడు.

niharikakonidelalatestpic.jpg

అలాగే ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న నిహారిక ఈ సినిమాతో కొత్త టాలెంట్ ని తెలుగు పరిశ్రమకి పరిచయం చేస్తున్నారు. దర్శకుడు, ఇందులో చాలామంది నటులు కొత్తవారే. ఇది ఒక విలేజ్ నేపథ్యంలో సాగే చిత్రంగా ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. అలాగే సినిమాలో విషయం వుంది అని కూడా తెలుస్తోంది.

niharikalatestpic.jpg

తెలుగులో 'వాట్ ది ఫిష్' అనే సినిమా పోస్టర్ గత సంవత్సరం డిసెంబర్ లో విడుదల చేశారు. అందులో నిహారిక అష్టలక్ష్మిగా కనపడుతుందని చిత్ర నిర్వాహకులు ప్రకటించారు. ఈ సినిమాకి వరుణ్ కోరుకొండ దర్శకుడు. ఈ సినిమా పోస్టర్ అప్పుడు విడుదల చేశారు, కానీ ఆ తరువాత ఈ సినిమా గురించి ఎక్కువ సమాచారం ఇవ్వలేదు. బహుశా చిత్రీకరణ జరుగుతూ ఉండొచ్చు.

నిహారిక ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ నటిగా చేస్తూనే, ఇంకో పక్క తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థ నుండి చిన్న సినిమాలు నిర్మిస్తూ, కొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తూ నిర్మాతగా సినిమాలు తీస్తూ రెండింటిలోనూ బిజీగా వున్నారు. అలాగే తాజాగా ఆకుపచ్చ డ్రెస్ లో ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో పెట్టి 'పచ్చదనమే' అని ఒక కేప్షన్ ఇచ్చారు.

Updated Date - Jul 30 , 2024 | 06:49 PM