Natti Kumar: ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ని అందుకే రీ రిలీజ్ చేస్తున్నాం

ABN , Publish Date - Feb 03 , 2024 | 06:27 PM

‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా పన్నెండు ఏళ్ల క్రితం వచ్చినప్పటికీ, నాటి రాజకీయాలకే కాదు నేటి రాజకీయాలకు కూడా అద్దంపట్టే విధంగా ఉంటుందని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ అన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’. ఈ సినిమాను ఫిబ్రవరి 7న నట్టి కుమార్ రీ రిలీజ్ చేయబోతున్నారు.

Natti Kumar: ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ని అందుకే రీ రిలీజ్ చేస్తున్నాం
Natti Kumar about CGR

‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu) సినిమా పన్నెండు ఏళ్ల క్రితం వచ్చినప్పటికీ, నాటి రాజకీయాలకే కాదు నేటి రాజకీయాలకు కూడా అద్దంపట్టే విధంగా ఉంటుందని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ (Natti Kumar) అన్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా పూరీ జగన్నాధ్ (Puri Jagannadh) దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’. ఈ చిత్రం 2012లో విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాను నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నట్టి కుమార్ ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..

‘‘ఈ సినిమా కలెక్షన్స్‌కు సంబంధించి సేల్ అయిన ప్రతి టిక్కెట్ నుంచి 10 రూపాయలను జనసేనకు ఫార్టీ ఫండ్‌గా అందజేస్తాం. ఫ్యాన్స్‌కు ప్రత్యేక విన్నపం ఏమిటంటే... అసాంఘిక శక్తులు కావాలని థియేటర్స్‌ను నాశనం చేయాలని చూస్తే, అలాంటి వారిని పోలీసులకు, థియేటర్ యాజమాన్యానికి పట్టించండి. దేవాలయం లాంటి థియేటర్స్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి. (Cameraman Gangatho Rambabu Re Release Details)


CGR.jpg

మన నాయకుడికి చెడ్డ పేరు రాకుండా చూడాలి. ఈ సినిమా ఈ సమయంలో రీ రిలీజ్ చేయడానికి కారణం పూర్తి పొలిటికల్ సబ్జెక్టుతో తీసిందన్న ఉద్దేశ్యమే. ఇది ఆ రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ విజన్‌తో చూపించడం జరిగింది. ఇందులోని డైలాగ్స్ ఇప్పుడు ఎవరికి తగలాలో వారికి తగులుతాయి. ఈ సినిమాతో పవన్‌గారి ఆలోచనలు తెలియాలన్నది మా ఆకాంక్ష. ఎన్నికల ముందు ఎన్నో పొలిటికల్ సినిమాలు వస్తాయి. యాత్ర-2 సినిమా సెన్సార్ అయితే దానిపై న్యాయపోరాటం చేస్తాం. ఏపీలో రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పొత్తు అధికారాన్ని కైవసం చేసుకుంటుంది’’ అని నట్టి కుమార్ స్పష్టం చేశారు. (Natti Kumar about Cameraman Gangatho Rambabu Re Release)


ఇవి కూడా చదవండి:

====================

*‘సప్త సాగరాలు దాటి’ డైరెక్టర్ తదుపరి చిత్ర హీరో ఎవరంటే?

**************************

*Chiranjeevi: ఎల్‌కే అద్వానీకి ‘భారతరత్న’.. మెగాస్టార్ స్పందనిదే..

*************************

*Simbu and Varalaxmi: శింబుతో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పెళ్లి.. వారిద్దరూ ఎలా రియాక్ట్ అయ్యారంటే?

****************************

Updated Date - Feb 03 , 2024 | 06:34 PM