ఎన్టీఆర్‌ అంటే నవరసాలకు అలంకారం: బాలకృష్ణ

ABN , Publish Date - Jan 18 , 2024 | 10:44 AM

ఎన్టీఆర్‌ అంటే నవరసాలకు అలంకారమని, పేదల సంక్షేమానికి ఎన్టీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని అన్నారు ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ. లెజెండ్ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద కుటుంబసభ్యులతో కలిసి నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు.

ఎన్టీఆర్‌ అంటే నవరసాలకు అలంకారం: బాలకృష్ణ
Nandamuri Family at NTR Ghat

ఎన్టీఆర్‌ (NTR) అంటే నవరసాలకు అలంకారమని, పేదల సంక్షేమానికి ఎన్టీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని అన్నారు ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). లెజెండ్ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద కుటుంబసభ్యులతో కలిసి నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. బాలకృష్ణతో పాటు నందమూరి రామకృష్ణ.. ఎన్టీఆర్ మనవళ్లు, సినీనటులు జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR), కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) నివాళులర్పించారు. ఉదయాన్నే అక్కడికి చేరుకుని అంజలి ఘటించారు. వారితో పాటు తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి కూడా ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.


jr-ntr.jpg

తన తండ్రికి నివాళులర్పించిన అనంతరం బాలకృష్ణ (Balakrishna) మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ అంటే నవరసాలకు అలంకారం. ఆయన పేదల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. తెలుగువారి దమ్ము, ధైర్యం ఎన్టీఆర్. ఎన్టీఆర్ అమలు చేసిన పథకాలను మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. ఎన్టీఆర్ నడిచిన మార్గం స్ఫూర్తిదాయకం. అందుకే ఇప్పటికీ అందరూ ఆయనని అన్నగారు అని పిలుచుకుంటూ, దైవంగా కొలుచుకుంటూ ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద నందమూరి వారసులు నివాళులు అర్పిస్తోన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నందమూరి అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా నందమూరి తారకరామారావుకు అంజలి ఘటిస్తున్నారు.

NTR-and-Kalyan-Ram.jpg

Bala-2.jpg

Bala.jpg


ఇవి కూడా చదవండి:

====================

*Ayalaan: కోలీవుడ్‌లో సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా.. టాలీవుడ్‌లో ఎప్పుడంటే?

****************************

*Naa Saami Ranga: బ్రేకీవెన్‌కి దగ్గరగా.. 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

*****************************

*Ajay Gadu: ‘అజ‌య్ గాడు’ డైరెక్ట్‌గా ఓటీటీలోకి.. ఈ ఓటీటీలో ఫ్రీగా చూసేయండి

******************************

*HanuMan: ‘హను-మాన్’ ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం

***************************

Updated Date - Jan 18 , 2024 | 11:36 AM