Biggboss 8: పృథ్వీకి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన నాగార్జున

ABN , Publish Date - Oct 19 , 2024 | 08:26 PM

‘ఫస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ట్విస్ట్‌, టర్న్‌ లిమిట్‌ లేదు’ అంటూ మొదలైన బిగ్‌బాస్‌-8 (Bigboss 8)సోసోగా సాగుతుంది. పృథ్వీకి మాత్రం బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు.

‘ఫస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ట్విస్ట్‌, టర్న్‌ లిమిట్‌ లేదు’ అంటూ మొదలైన బిగ్‌బాస్‌-8 (Bigboss 8) సోసోగా సాగుతుంది. ఇప్పటి దాకా జరిగిన ఎపిసోడ్స్‌తో పెద్దగా రేటింగ్‌ లేదనీ, ఇంటి సభ్యులు ఎవరో ఏంటో కూడా తెలియని వాళ్లని కామెంట్స్‌ వినిపిస్తున్న నేపథ్యంలో బిగ్‌బాస్‌ సీజన్‌ -1 నుంచి ఏడో సీజన్‌ వరకూ కంటెస్టెంట్‌లుగా ఉన్న అలరించిన వారిని   వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి పంపారు. ఇదంతా ఒకటైతే వీకెండ్‌ కోసం ఆడియన్స్‌ ఎదురుచూస్తుంటారు. శని, ఆదివారాల్లో నాగార్జున (Nagarjuna) వస్తారని ఎంటర్‌టైన్‌ చేస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

గత వారం రోజులుగా హౌస్‌లో జరిగిన పరిణామాలపై నాగార్జున మాట్లాడారు. టాస్క్‌లో భాగంగా హెయిర్‌ కట్‌ చేయించుకున్న అవినాష్‌ను మెచ్చుకున్నారు. వెనకడుగు వేసిన పృథ్వీకి మాత్రం బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. గడ్డం తీసేస్తే రూ.5లక్షలు లేదా మూడు వారాలు నామినేషన్స్‌లో లేకుండా ఉండేలా ఇమ్యూనిటీ ఇస్తానని ఆఫర్‌ ఇచ్చారు. మరి ఆ ఆఫర్‌కు పృథ్వీ ఓకే చెప్పాడా? లేదా? అన్నది తెలియాలి. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Updated Date - Oct 19 , 2024 | 08:33 PM