మనోజ్.. మీ అమ్మ హాస్పిటల్ పాలైందిరా: మోహన్ బాబు వాయిస్ మెసేజ్ వైరల్

ABN , Publish Date - Dec 10 , 2024 | 08:54 PM

మంచు మనోజ్ చేష్టలపై ఆయన తండ్రి మోహన్ బాబు పంపిన ఒక వాయిస్ మెసేజ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వాయిస్ మెసేజ్‌లో మోహన్ బాబు ఎంతో ఎమోషనల్ అవుతూ.. మనోజ్‌కు మంచి చెబుతున్నారు. అసలీ వాయిస్ మెసేజ్‌లో ఏముందంటే..

Mohan Babu Voice Message

మంచు మనోజ్ చేష్టలపై ఆయన తండ్రి మోహన్ బాబు పంపిన ఒక వాయిస్ మెసేజ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వాయిస్ మెసేజ్‌లో మోహన్ బాబు ఎంతో ఎమోషనల్ అవుతూ.. మనోజ్‌కు మంచి చెబుతున్నారు. అసలీ వాయిస్ మెసేజ్‌లో ఏముందంటే..

‘‘మనోజ్ నువ్వు నా బిడ్డవు. నిన్ను ఎలా పెంచానురా నేను. అందరికంటే నిన్నే గారాభంగా పెంచాను. నీకే ఎక్కువ ఖర్చుపెట్టి చదివించాలనుకున్నాను. నువ్వు ఏది అడిగినా నీకిచ్చాను. కానీ నువ్వు ఈరోజు చేస్తున్న పని.. బిడ్డలు గుండెల మీద తంతారంటారే.. అలా తన్నావురా. మనసు ఆవేదన‌తో కృంగిపోతుందిరా. నేను, మీ అమ్మ ఏడుస్తున్నామ్ రా. మీడియాలో ఎలా పడితే అలా రాతలు రాస్తున్నారు. నా బిడ్డ నన్ను కొట్టడం ఏంటిరా.. నా బిడ్డ నన్ను తాకలా. కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డాం. ప్రతి ఫ్యామిలీ‌లోనూ ఉండేవే. అలాంటి ఫ్యామిలీ లేదంటే.. వారి కాళ్లు కడగొచ్చు. భారత భాగవత రామాయణాలు చూసావ్ కదరా. మీ అమ్మ ఎంత కుమిలిపోతుందిరా.

Also Read-Big Twist: మోహన్ బాబు ఇంట్లోని పని మనిషి ఏం చెప్పిందంటే..

మనోజ్ నీ వల్ల మీ అమ్మ హాస్పిటల్ పాలయింది. మనోజు నీకన్ని ఇచ్చినా..‌ నాకు అపఖ్యాతి అపకీర్తి తీసుకువచ్చావు. ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. అవి నీకు తెలుసు అనుకున్నా. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాట విని.. తాగుడుకి అలవాటు పడ్డావు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే పరిస్థితికి తీసుకువచ్చావు. కులం, మతం తేడా లేకుండా మనం విద్యను అందిస్తున్నాము. మన దగ్గర చదువుకున్నవారు ఎంతో మంది గొప్పవారు అయ్యారురా. నువ్వు అక్కడే చదువుకున్నావు.. నటుడి అయ్యావు. తాగుడికి అలవాటు పడి నువ్వు, నీ భార్య ఇంట్లో బిహేవ్ చేసే విధానం నీచం. భగవంతుడు చూస్తున్నాడురా.. ఎవరు తప్పు చేస్తున్నారనేది. అందరికీ మాట్లాడుకునేందుకు ఎంత అవకాశం ఇచ్చాం. నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావ్..


ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్లని కొడుతున్నావ్. వారిని కొట్టడం మహా పాపం రా‌. నేను దండించటం వేరు. మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీలో కొడతాడు తిడతాడనేది ఉండొచ్చేమో.. కానీ ఇంట్లో నువ్వు చిన్న పిల్లలను కొట్టిన దానికి చనిపోయేవాడు. అందుకే నువ్వు, నీ భార్య పూర్తిగా మారి బయట ఉండమని చెప్పాను‌. ఎన్నో సార్లు తప్పు చేసావ్. మూడు రోజుల నుంచి వస్తున్న వార్తలు ఎంతో ఆవేదన కలిగించాయి

ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా.. వద్దా అనేది నా ఇష్టం. పిల్లలకు ఇస్తానా.. దానధర్మాలు చేస్తానా అనేది నా ఇష్టం. మా నాన్న నాకు ఆస్తులు ఇవ్వలేదు, అయినా నేను సంపాదించుకున్నాను. మనోజ్ నన్ను కొట్టలేదు, మేమిద్దరం ఘర్షణ పడ్డాం. నా ఇంట్లోకి నువ్వే అక్రమంగా చొరబడ్డావ్, నా మనుషులను కొట్టావ్. నాకు రక్షణ కావాలని పోలీసులను కోరాను. నీ కూతురును వచ్చి తీసుకెళ్లు, నా దగ్గర వదిలిపెట్టినా ఇబ్బంది లేదు. పోలీసుల సమక్షంలోనే నీ బిడ్డను నీకు అప్పగిస్తా..’’ అని మోహన్ బాబు పంపిన వాయిస్ మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read-Mohan Babu: అన్నదమ్ముళ్లులా కలిసి బ్రతకాలని కోరుకుంటే.. మోహన్ బాబు ట్వీట్ వైరల్

Also Read-Manchu Family: మనోజ్ హాస్పిటల్‌ల్లో.. మోహన్ బాబు ట్విట్టర్‌లో.. మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది?

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 10 , 2024 | 09:24 PM