Klin Kaara: క్లింకారా కేర్‌టేకర్‌కు.. నెల జీతం ఎంతో తెలిస్తే షాకే!
ABN , Publish Date - Feb 05 , 2024 | 03:49 PM
రామ్‌చరణ్, ఉపాసన దంపతుల గారాలపట్టి క్లింకారాను చూసుకునే కేర్ టేకర్‌కు సంబంధించిన ఓ విషయం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అతుతున్నది.
మెగా ప్రిన్సెస్ (Mega Princess) క్లింకారా (Klin Kaara) ఏ ముహుర్తానా జన్మించిందో గానీ చిరంజీవి ఇంట సరికొత్త ఆనందాన్ని, కీర్తి కిరీటాలను తీసుకు వచ్చింది. వివాహం జరిగిన 11 సంవత్సరాల తర్వాత రామ్‌చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త బయటకొచ్చింది మొదలు RRR బ్లాక్ బస్టర్‌గా అవడం, ఆస్కార్ రావడం, వరుణ్ తేజ్ ఓ ఇంటి వాడవడం, చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం ఇలా వరుసబెట్టి ఆ ఇంట అన్నీ శుభ పరిణామాలే జరిగాయి. ఇదిలాఉండగా చిరంజీవి, కోట్లాదిమంది చిరు అభిమానుల దశాబ్దాల ఎదురుచూపుల తర్వాత వారసురాలు జన్మించడంతో ఆ ఇంట సరికొత్త సందడి నెలకొంది. తమ గారాలపట్టికి కనకదుర్గ అమ్మవారి నామాలలో ప్రముఖమైన క్లింకారా అనే పేరును నామకరణం చేసినప్పటికీ ఇంతవరకు తన ముఖాఃన్ని బయటి ప్రపంచానికి చూపించలేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా మంది క్లింకారాను చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ క్రమంలో చిరు,రామ్ చరణ్ అభిమానులు క్లింకారా (Klin Kaara) ను మెగా ప్రిన్సెస్ (Mega Princess)గా పిలుచుకుంటూ ఆ పేరుతో సోషల్ మీడియాల్లో వంద కొద్ది వీడియోలు చేస్తున్నారు,క్లింకారాను మీరెప్పుడైనా చూశారా, ఆ పేరు ప్రత్యేకత తెలుసా, అంటూ కుప్పలు కుప్పులుగా వార్తలు దర్శనమిస్తుండగా తాజాగా క్లింకారాను చూసుకునే కేర్ టేకర్‌కు సంబంధించిన విషయం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అతుతున్నది. ఆ కేర్ టేకర్ గతంలో ఎక్కడ పని చేసింది, ఆమెకు నెలకు ఎంత పే చేస్తారనే వార్తలతో ముంచెత్తుతున్నారు. గత ఏడాది జూన్ 20న ఉపాసన క్లింకారా (Klin Kaara) కు జన్మనిచ్చిన దగ్గరి నుంచి ఈ వార్తలు బాగా హల్చల్ చేస్తున్నాయి.
బిడ్డ పుట్టిన మూడు నాలుగు రోజుల్లోనే ఉపాసన అంత యాక్టివ్‌గా ఎలా మారింది, ఎలాంటా ఆహారం తీసుకుందనే వీడియోలు రాగా,ఆ తర్వాత నెల రోజులకు క్లింకారా ఉండే గది గురించి ఎవరు డిజైన్ చేశారు, ఏ విధంగా చేశారు, దానికి ఎంత ఖర్చైంది, ఆ గది ప్రత్యేకలంటూ వార్తలు చాలానే యూట్యూబ్‌లో దర్శణమిచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు క్లింకారా కేర్ టేకర్ గురించిన వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. గతంలో బాలీవుడ్ స్టార్ కపుల్స్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్‌ల సంతానం, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ ల సంతానానికి కేర్ టేకర్‌గా వ్యవహరించిన సావిత్రి ఇప్పుడు రామ్‌చరణ్, ఉపాసనల కూతరు క్లింకారకు కేర్ టేకర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సెలబ్రిటీ కేర్‌టేకర్ నానిగా పేరు తెచ్చుకున్న సావిత్రి ఇటీవల మెగా ఫ్యామిలీ పాల్గొన్న రెండు ప్రైవేట్ కార్యక్రమాల్లో కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది. రామ్‌చరణ్ వరుస సినిమా షూటింగ్‌ల బిజలో ఉండడం, ఉపాసన అపోలో హస్పిటల్ నిర్వహణలో బిజీగా మారడంతో క్లింకారా (Klin Kaara) ఆలనా పాలన చూసుకునేందుకు ఈ కేర్‌టేకర్‌ను నియమించినట్లు, ఇందుకు గాను ఆమెకు నెలకు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు చెల్లిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.