Geethanjali: ‘గీతాంజలి’ గిరిజ ఇప్పుడెలా ఉందో చూశారా..

ABN , Publish Date - Nov 28 , 2024 | 08:40 PM

‘మనిద్దరం లేచిపోదామా..’ అంటూ అప్పట్లో అందరి హృదయాలను దోచేసిన ‘గీతాంజలి’ ఫేమ్ గిరిజ ఇప్పుడెలా ఉన్నారో, ఏం చేస్తున్నారో తెలుసా..

Geethanjali Fame Girija

మణిరత్నం దర్శకత్వం వహించిన అణిముత్యాలలో ‘గీతాంజలి’ సినిమా ఒకటి. ఈ సినిమా కథ, కథనం, పాటలు అన్నీ కూడా నేటి ఫిల్మ్ మేకర్స్‌కి పాఠాలవంటివని చెప్పుకోవచ్చు. ఒక మంచి ప్రేమ కథా చిత్రం చెప్పమంటే.. మొదటి స్థానంలో ఉండే చిత్రం ‘గీతాంజలి’. మణిరత్నం దర్శకత్వం వహించిన ఒకే ఒక్క తెలుగు చిత్రంగా పేరున్న ఈ సినిమా అప్పట్లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. సంగీత ప్రియులను ఆహ్లాదపరుస్తూనే ఉంటాయి. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ గిరిజ.. ఈ సినిమా తర్వాత మళ్లీ ఎక్కడా కనిపించలేదు. ‘గీతాంజలి’ తర్వాత ఆమె ‘హృదయాంజలి’ అనే సినిమా మాత్రమే చేశారు. ఆ తర్వాత సినిమాలకు, నటనకు బై చెప్పేసిందీ బ్రిటీష్ బ్యూటీ.

Also Read-ప్రభాస్ లాంటి కొడుకు కావాలి: ‘దేవర’ మదర్

‘గీతాంజలి’ సినిమాలో తన ముద్దు ముద్దు నటనతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న గిరిజ.. ఆ వెంటనే సినిమాలకు స్వస్తీ చెప్పి అందరినీ నిరాశ పరిచారు. అందులో ‘మనిద్దరం లేచిపోదామా..’ అంటూ ఆమె పలికే తీరు, నటన అన్నీ కూడా రీల్ సీన్‌లా కాకుండా రియల్ సీన్‌లా తలపిస్తాయి. తొలి సినిమాలో అల్లరిపిల్లగా కనిపించి, చివరికి గుండెలు పిండేసిన గిరిజకు ‘గీతాంజలి’ తెచ్చిన పాపులారిటీ, క్రేజ్ అంతా ఇంతా కాదు. నిజంగా ఆ తర్వాత ఆమె సినిమాలు చేసి ఉంటే.. కచ్చితంగా నెంబర్ వన్ హీరోయిన్ అయ్యిండేదని అనుకున్నవారు కూడా ఉన్నారు. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ.. సినిమాలకు, నటనకు బై బై చెప్పేసి ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.


Girija-Pic.jpg

మరి అప్పుడు గీతగా అల్లరి పిల్లగా కనిపించి అందరి మనసులు దోచేసిన గిరిజ.. ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుంది? అని తెలుసుకోవాలని ఉంటుంది కదా. వాస్తవానికి గిరిజ పూర్తి పేరు గిరిజా ఎమ్మాజేన్ షెట్టర్. తండ్రి కన్నడిగుడు.. తల్లి ఆంగ్లేయురాలు. ఆమె పెరిగింది అంతా బ్రిటన్‌లోనే. భరతనాట్యం నేర్చుకోవడానికి ఇండియా వచ్చిన గిరిజను మణిరత్నం తన సినిమాలో నటింపజేశారు. ఆ తర్వాత ఆమె ఆధ్యాత్మికత వైపు నడిచింది. ప్రస్తుతం ఆమె రచయిత్రిగా కొనసాగుతున్నారు. ‘ఇంటెగ్రల్‌ యోగా ఫిలాసఫీ- ఇండియన్‌ స్ప్రిచ్యువల్‌ సైకాలజీ’ డాక్టరేట్‌ని అందుకున్న గిరిజ అప్పుడప్పుడు శ్రీ అరబిందో ఆశ్రమంలో గడిపేందుకు పాండిచ్చేరి వస్తుంటారు. అలా వచ్చినప్పుడు మీడియాతో ఆమె మాట్లాడకపోయినప్పటికీ.. ఆమె ఇచ్చే స్పీచ్‌ల వీడియోల నుండి ఆమె ఫొటోలను క్యాప్చర్ చేసి.. ‘గీతాంజలి’ గిరిజ ఇప్పుడెలా ఉందో చూశారా? అంటూ నెటిజన్లు కొందరు ఆమె ఫొటోలను వైరల్ చేస్తున్నారు.

Also Read-సిద్ధార్ద్, అదితి రావ్ హైదరి మళ్లీ పెళ్లి.. ఇదేం ట్విస్ట్! ఫొటోలు వైరల్

Also Read-Akkineni Family: ఒకవైపు నాగచైతన్య పెళ్లి.. మరో వైపు అఖిల్ నిశ్చితార్థం

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 28 , 2024 | 08:40 PM