Manchu Lakshmi: ఏదో కోల్పోతావనే భయం ఎందుకు..
ABN , Publish Date - Dec 12 , 2024 | 09:13 AM
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే మంచి లక్ష్మీ ప్రసన్న(manchu Lakhi Prasanna) తాజాగా ఓ వైరల్ పోస్ట్ పెట్టారు. ఇప్పుడా పోస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే మంచి లక్ష్మీ ప్రసన్న(manchu Lakhi Prasanna) తాజాగా ఓ వైరల్ పోస్ట్ పెట్టారు. ఇప్పుడా పోస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అప్పుడప్పుడు మోటివేషన్ కొటేషన్స్ (Motivation Quoto) పెట్టే ఆమె మరోసారి అలాంటి కొటేషన్ ఇచ్చారు. ‘ఈ ప్రపంచంలో ఏదీ మనది కానప్పుడు.. ఏదో కోల్పోతావనే భయం నీకెందుకు’ అంటూ ఓ రచయిత రాసిన సందేశం షేర్ చేశారు. మంచు కుటుంబంలో వివాదాలు జరుగుతోన్న సమయంలో లక్ష్మి చేసినీ పోస్ట్ వైరల్‌గా మారింది. బుధవారం కూడా తన కుమార్తె చిరునవ్వులు చిందిస్తోన్న ఓ వీడియోను ఆమె షేర్ చేశారు. ‘‘పీస్ (శాంతి)’’ అని క్యాప్షన్ జత ఇచ్చారు. 2024లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాని మరో పోస్‌్‌టలో తెలిపారు(manchu Family War).
ఇటీవల ఆదిపర్వం సినిమా, ‘యక్షిణి’ అనే వెబ్ సిరీస్‌తో మంచు లక్ష్మి ప్రేక్షకుల ముందుకొచ్చారు.కొన్నాళ్లగా ఆమె ముంబయిలో నివాసం ఉంటున్నారు. హైదరాబాద్ నుంచి ముంబయికి షిఫ్ట్ కావడానికి కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో వివరించారు. దక్షిణాదిలో తాను ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించానని, కాకపోతే ఇక్కడ కొన్ని పరిమితులు కూడా ఉన్నాయన్నారు. ముంబయిలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఆడిషన్స్‌లో పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. హిందీలో తెరకెక్కే వెబ్ సిరీస్‌లు, సినిమా ఆఫర్ల కోసం చూస్తున్నట్లు చెప్పారు.