Malvi malhotra - Raj Video Leak: హోటల్‌ గదిలో ఇద్దరూ.. ఏం చేస్తున్నారంటే..

ABN , Publish Date - Jul 23 , 2024 | 12:51 PM

గత రెండువారాలుగా ఏ మాధ్యమంలో చూసినా రాజ్‌తరుణ్‌ (Raj Tarun), లావణ్య(Lavanya) ల పేర్లే హాట్‌ టాపిక్‌గా మారాయి. తనతో 11 ఏళ్లుగా జీవితం పంచుకుని, ఇప్పుడు వేరే అమ్మాయి మాల్వీ మల్హోత్రతో (Malvi malhotra) సన్నిహితంగా ఉంటూ

గత రెండువారాలుగా ఏ మాధ్యమంలో చూసినా రాజ్‌తరుణ్‌ (Raj Tarun), లావణ్య(Lavanya) ల పేర్లే హాట్‌ టాపిక్‌గా మారాయి. తనతో 11 ఏళ్లుగా జీవితం పంచుకుని, ఇప్పుడు వేరే అమ్మాయి మాల్వీ మల్హోత్రతో (Malvi malhotra) సన్నిహితంగా ఉంటూ తనను రాజ్‌తరుణ్‌ వదిలించుకోవాలనుకుంటున్నాడు, నేను రాజ్‌ను వదులుకోలేను, నాకు అతనే కావాలి, న్యాయం చేయండి అంటూ పోలీసులను ఆశ్రయించింది లావణ్య. అంతే కాదు.. రాజ్‌తరుణ్‌పై కేసు కూడా పెట్టింది. ఇద్దరూ పరస్పరం మాటల తూటాలను వదులుకుంటున్నారు. ఆమె తనకు నరకం చూపిస్తుందని, బ్లాక్‌మెయిల్‌ చేస్తుందని రాజ్‌తరుణ్‌ పోలీసులతో చెప్పాడు. రాజ్‌ తరుణ్‌ మాల్వీతో కలిసి చెన్నైలో ఓ హోటల్‌లో ఉన్నారని ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని లావణ్య చేసిన ఆరోపణలు నిజమే అనిపిస్తున్నాయి.

Tarun.jpg

తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియో అందుకు నిదర్శనం. మంగళవారం రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్రలకు సంబంధించిన ఓ వీడియో లీక్‌ అయింది. అందులో ఇద్దరూ హోటల్‌ రూమ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మాల్వీ మేకప్‌ చేసుకుంటున్న సమయంలో రాజ్‌తరుణ్‌  పక్కనే ఉండి.. ఆమెను మిర్రర్‌ సెల్ఫీ తీశాడు. ఆ వీడియోలో ఇద్దరూ సాన్నిహిత్యంగా ఉన్నారు అంతే కాదు.. రొమాంటిక్‌ వేలో బయటకు చెప్పలేని కొన్ని మాటలు మాట్లాడుకున్నారు. 'బేబీ నువ్వు చాలా అందంగా ఉన్నావ్‌’ అంటూ మాల్వీని పొగడ్తల్లో ముంచాడు రాజ్‌. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. దీనిని బట్టి లావణ్య చేసిన ఆరోపణలు అన్ని నిజమే అని తెలుస్తోంది. అయితే ఈ వీడియో బయటకు ఎలా వచ్చిందన్నది తెలియాలి. 

Updated Date - Jul 23 , 2024 | 12:54 PM