Mahesh Babu Look: అనంత్‌ అంబానీ పెళ్లిలో.. సోషల్ మీడియా తగలెడిపోతోంది

ABN , Publish Date - Jul 12 , 2024 | 10:09 PM

ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లి సందడి మాములుగా లేదు. ఆకాశ పందిళ్లు.. భూలోక సందళ్లు అన్నట్లుగా ఆకాశంలో ఉండాల్సిన స్టార్స్ భూమిపైకి వచ్చాయా అన్నట్లుగా ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధికా మర్చెంట్‌ల వివాహానికి తారాలోకం హాజరైంది. అందులో ముఖ్యంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఈ వేడుకకు హాజరవగా.. ఈ వేడుకలో ఆయన లుక్ వైరల్ అవుతోంది.

Super Star Mahesh Babu At Ambani Family Wedding

ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లి సందడి మాములుగా లేదు. ఆకాశ పందిళ్లు.. భూలోక సందళ్లు అన్నట్లుగా ఆకాశంలో ఉండాల్సిన స్టార్స్ భూమిపైకి వచ్చాయా అన్నట్లుగా ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ (Ananth Ambani), ఫార్మా దిగ్గజం వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధికా (Radhika Merchant) మర్చెంట్‌ల వివాహానికి తారాలోకం హాజరైంది. అందులో ముఖ్యంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) తన ఫ్యామిలీతో కలిసి ఈ వేడుకకు హాజరవగా.. ఈ వేడుకలో ఆయన లుక్ వైరల్ అవుతోంది. భార్య నమ్రత, కుమార్తె సితారలతో కలిసి ఆయన ఈ వేడుకకు హాజరయ్యారు.

ఇంకా చెప్పాలంటే మహేష్ లుక్ వైరల్ అనే కంటే కూడా.. సోషల్ మీడియా తగలెడిపోతుంది అంటే బాగుంటుందేమో. ఎందుకంటే, అంతగొప్పగా అంబానీ ఇంట పెళ్లి జరుగుతుంటే.. సోషల్ మీడియాలో మాత్రం ఈ సూపర్ స్టార్ హవానే హైలెట్ అవుతోంది. ముఖ్యంగా మహేష్ బాబు లుక్‌పై నెటిజన్ల కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్ అవుతున్నాయి. మాములుగానే మహేష్ బాబు అందగాడు. ఆ విషయం ఎవరిని అడిగినా చెబుతారు. కానీ ఇప్పుడాయన సినిమా కోసం మేకోవర్ అవుతున్న లుక్‌లోనే ఈ వేడుకకు హాజరవడంతో.. ఫ్యాన్స్, నెటిజన్లు ఆయన ఫొటోలను, వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు. అందుకే సోషల్ మీడియా అంతా మహేష్ బాబు పిక్స్‌తో, కామెంట్స్‌తో నిండిపోతోంది. (Mahesh Babu at Ananth Ambani Wedding)


Namratha.jpg

మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ‘గుంటూరు కారం’ (Guntru Kaaram) చిత్రంతో అలరించిన సూపర్ స్టార్.. ప్రస్తుతం రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించనున్న ‘SSMB29’ కోసం రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. ఈ చిత్రంలో మహేశ్ భిన్నంగా కనిపిస్తారు. ఇప్పటికే పలు ఫొటో షూట్లు నిర్వహించారు జక్కన్న. మహేష్‌ కూడా కసరత్తులు మొదలుపెట్టారు. హీరో పేరు తప్ప మరో అప్‌డేట్‌ ఇవ్వని రాజమౌళి మహేశ్ పుట్టినరోజున ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ ఇవ్వనున్నారట.

Updated Date - Jul 13 , 2024 | 03:01 AM