Mahesh Babu: ఇలా ఎలా చేయగలుగుతున్నారు.. ఇంకా నా మైండ్‌లోనే ఉంది! ఎమోషనలైన మహేశ్ బాబు
ABN , Publish Date - Feb 27 , 2024 | 05:49 PM
మహేశ్ బాబు తాజాగా ఓ వెబ్ సిరీస్ పై తన సోషల్ మీడియాలో చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయి దానిపై బాగా చర్చ జరగడమే కాక ఆ సిరీస్ ఏంటి, అసలు అందులో అంతగా ఏ ముందనే చర్చ నడుస్తోంది.
మహేశ్ బాబు (Mahesh Babu) తాజాగా ఓ వెబ్ సిరీస్ పై తన సోషల్ మీడియాలో చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ‘ఎవరైనా ఇలా ఎలా చేయగలుగుతున్నారు. ఆ పని చేస్తున్నప్పుడు వారి చేతులు కనీసం వణకవా అనే అనేక ప్రశ్నలు నాకు ఈ పోచర్ (Poacher) సిరీస్ చూసిన తర్వాత అనిపించిందని, అప్పటినుంచి అందులోని సన్నివేశాలు నా మైండ్ లోనే మెదులుతున్నాయంటూ’ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేశారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్టు గురించి బాగా చర్చ జరగడమే కాక ఆ సిరీస్ ఏంటి, అసలు అందులో అంతగా ఏ ముందనే చర్చ నడుస్తోంది.
ఇక సిరీస్ విషయానికి వస్తే.. ఇటీవలే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన పొచర్ (Poacher) అనే మలయాళ వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ప్రసిద్ధ మలయాళ నటి నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దివ్యేంద్ర భట్టాచార్య ప్రధాన పాత్రలు పోషించగా, ప్రతిష్టాత్మక ఎమీ అవార్డు విన్నర్ రిచీ మెహతా దర్శకత్వం వహించారు. దాదాపు 5 సంవత్సరాలు ఈ చిత్ర యూనిట్ కేరళలోని కొన్ని రహస్య ప్రాంతాల్లో రీసర్చ్ చేయడమే గాక, సీనియర్ ఫారెస్ట్ అధికారుల అభిప్రాయాలను తీసుకోని, అప్పటి కేసులను స్టడీ చేసి మరి నిజంగా జరిగిన ప్రాంతాల్లోనే ఈ సిరీస్ ను రూపొందించడం విశేషం
ఎన్నో సంవత్సరాలుగా అడవుల్లో జంతువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ముఖ్యంగా ఏనుల దంతాల కోసం వాటిపై ఎలా దాడులు చేసి చంపుతారు, ఆ తర్వాత వాటి దంతాలను కలెక్ట్ చేసి ఎలా రవాణా చేస్తారు, ఈ క్రమంలో డీలర్లు, ఏజెంట్ల మధ్య జరిగే కుట్రలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ ఈ సిరీస్ సాగుతుంది.
అంతేగాక చివరకు వచ్చేసరికి ఏనుగుల పరిస్థితిని చూసి మనకు జాలీ కలిగేలా చేస్తుంది. ఇప్పుడు ఈ పొచర్ (Poacher) సిరీస్ నే మహేశ్ బాబు (Mahesh Babu) చూసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చాలా మంది దృష్టి ఇప్పుడు ఈ సిరీస్ పై పడింది. గతంలోనూ మహేశ్ (Mahesh Babu) నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన డార్క్ అనే ఓ సిరీస్ గురించి తెలపగా అప్పుడు దానిని చాలా మంది వీక్షించడం విశేషం.