Jai HanuMan : రాముడిగా మహేశ్ బాబు.. ఆంజనేయుడిగా చిరంజీవి

ABN , Publish Date - Jan 31 , 2024 | 02:17 PM

చిన్న చిత్రంగా వచ్చిన హ‌నుమాన్ సినిమా అంచ‌నాల‌కు మించి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డంతో దీనికి సీక్వెల్‌గా రానున్న జై హ‌నుమాన్ పై ఓ రేంజ్ లో అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో ఈ సినిమాపై రోజుకో రకమైన వార్తలు వస్తు సినిమాపై వీపరీతమైన క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

Jai HanuMan : రాముడిగా మహేశ్ బాబు.. ఆంజనేయుడిగా చిరంజీవి
JAI HANUMAN

సంక్రాంతి ప‌ర్వ‌దినాన గుంటూరుకారం,నా సామిరంగ‌,సైంథ‌వ్ వంటి మూడు పెద్ద‌ చిత్రాల‌తో పోటీ ప‌డుతూ మ‌రి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన హనుమాన్ (Hanuman) సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో, ఇంకా సృష్టిస్తుందో అంద‌రికీ తెలిసిందే. చిన్న చిత్రంగా వచ్చిన హ‌నుమాన్ సినిమా అంచ‌నాల‌కు మించి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డంతో దీనికి సీక్వెల్‌గా రానున్న జై హ‌నుమాన్ పై ఓ రేంజ్ లో అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో ఈ సినిమాపై రోజుకో రకమైన వార్తలు వస్తు సినిమాపై వీపరీతమైన క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ముఖ్యంగా ‘రాముడికి హనుమంతుడిచ్చిన మాట ఏమిటి?’ అన్న ఆసక్తికర సాయింట్ తో ‘జై హనుమాన్‌’పై ఆసక్తి పెంచేసిన ప్రశాంత్‌ వర్మ.. ఆ సినిమాకు సంబంధించి ఒక్కొ అంశం ఓ రేంజ్‌లో ప్లాన్‌ చేస్తూ అంచనాలు ఆకాశానికి పెంచేస్తున్నారు.దీంతో జై హునుమాన్ (Jai Hanuman) సినిమాలో హునుమంతుడిగా, శ్రీరాముడిగా ఎవరెవరు నటిస్తారో అంటూ, ఫలానా వారు నటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ నటులు ఈ పాత్రల్లో నటిస్తున్నారంటూ కూడా నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఓ పెద్ద స్టార్‌ హీరోనే జై హనుమాన్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తారని చెబుతూ వస్తున్న ప్రశాంత్‌ వర్మ.. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టగా అది సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ప్రశాంత్ వర్మ ఓ మీడియాతో మాట్లాడుతూ రాముడిగా మహేశ్ బాబు, ఆంజనేయుడిగా చిరంజీవిని నటింపజేయాలని ఉందంటూ చెప్పడంతో ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. మనుమాన్ చిత్రాన్ని మించి ఈ జై హనుమాన్ (Jai Hanuman) ఉంటుందని ఈ సినిమా స్కేల్ పెద్దది కావడంతో చెప్పాల్సిన విషయాలు చాలానే ఉన్నాయని అందుకే చూడగానే భక్తి భావం కలిగించే సామర్థ్యం ఉన్న ఆగ్ర నటుడి కోసం చూస్తున్నానని, పలువురు బాలీవుడ్‌ నటులు హనుమాన్‌ పాత్ర కోపం ఆసక్తి చూపారని, అయితే, ఆన్‌ స్క్రీన్‌తో పాటు, ఆఫ్‌ స్క్రీన్‌లోనూ వారి ఇమేజ్‌ సరిపోవాలని తెలిపారు. ఆ జాబితాలో చిరంజీవి గారు కూడా ఉండొచ్చని..అన్నీ కుదిరితే చిరంజీవి గారే ఆ పాత్ర చేసే అవకాశం ఉండొచ్చని ఆయన స్పష్టం చేశారు.


ఈ క్రమంలో ఇప్పటికే సోషల్ మీడియాలో చిరంజీవిని హనుమంతుడిగా, మహేశ్ బాబుని రాముడిగా ఊహిస్తూ రూపొందించిన చాలా ఫొటోలను, వీడియోలను, ఎడిట్స్ చాలా చూశామని, మేము కూడా వారి ఫొటోలను కొన్ని రూపాల్లో రీక్రియేట్‌ చేసి చూశామని మాకు మంచిగా అనిపించిందని తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి గారు చాలా బిజీగా ఉన్నారని, మహేశ్ బాబు గారు రాజమౌళి సినిమా పనుల్లో ఉన్నారని త్వరలో వారిని కలిసి ఈ విషయం చెబుతానని పేర్కొన్నాడు. ’జై హనుమాన్‌’ (Jai Hanuman) పనులు ఏడాది కిందటే మొదలు పెట్టామని, కథ సిద్ధంగా ఉందని, ఎలా తీయాలన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉందని, వీఎఫ్‌ఎక్స్‌ సహా చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించామని, స్క్రిఫ్ట్ కూడా రెడీ అయిందని జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రారంభం రోజున షూటింగ్ లాంఛనంగా మొదలు పెట్టామని తెలిపారు.

అయితే ఎంత పెద్ద స్టార్ హీరో ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించినా నా స్క్రిప్ట్‌ను మార్చుకోనని, వారి సూచనలు, అభిప్రాయాలు తీసుకుని తాను అనుకున్న ఇండియన్‌ సూపర్‌ హీరోల కథలన్నీ సినిమాలుగా తీస్తామని, ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరుగుతుందని ప్రశాంత్‌ వర్మ కుండబద్దలుకొట్టాడు. కొన్ని కథలను కేవలం కొత్త నటీనటులతో చేస్తామని, మహిళా ప్రాధాన్యం ఉన్న మూవీలో సమంత చేస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. ఇదిలాఉండగా రాముడిగా మహేష్ బాబు, ఆంజనేయుడిగా చిరంజీవి అనే కాన్సెప్ట్ వినడానికి, మనం ఊహించుకోవడానికి అద్భుతంగా ఉన్నా అది తెర మీద ఎలా ఉంటుందో అంటూ నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కిందరు అసలు బాగోదని మరికొందరు అత్యద్భుతంగా ఉంటుందంటూ ఈ కాంబినేషన్ నెవర్ భిఫోర్ అనే స్థాయిలో ఉంటుందంటున్నారు. ఓ రెండు నెలలు గడిస్తేనే మనకు ఈ వార్తలపై క్లారిటీ వస్తుంది. అప్పటివరకు వెయుట్ అండీ సీనే.

Updated Date - Jan 31 , 2024 | 02:17 PM