Kona Venkat: తారక్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా..
ABN , Publish Date - Apr 04 , 2024 | 11:13 AM
మ్యాన్ ఆఫ్ ద మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తానని అన్నారు రచయిత, నిర్మాత కోన వెంకట్. ఆయన నిరాహార దీక్ష చేస్తానంది.. పొలిటికలో.. మరొకటో విషయంలో కాదు. ‘అదుర్స్’ సీక్వెల్ విషయంలో. అవును.. ఎన్టీఆర్ ఇంటి ముందు కూర్చుని నిరాహార దీక్ష చేసైనా సరే.. ఆయనను ‘అదుర్స్’ సీక్వెల్‌కు ఒప్పిస్తానని కోన వెంకట్ చెప్పుకొచ్చారు.
మ్యాన్ ఆఫ్ ద మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తానని అన్నారు రచయిత, నిర్మాత కోన వెంకట్ (Kona Venkat). అదేంటి.. ఆయన ఇంటి ముందు ఈయన నిరాహార దీక్ష చేయడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? ఇదేదో పొలిటికల్ వ్యవహారం అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే.. పెద్ద మిస్టేక్ చేసినట్లే. కోన వెంకట్ నిరాహార దీక్ష చేస్తానంది.. పొలిటికలో.. మరొకటో విషయంలో కాదు. ‘అదుర్స్’ సీక్వెల్ విషయంలో. అవును.. ఎన్టీఆర్ ఇంటి ముందు కూర్చుని నిరాహార దీక్ష చేసైనా సరే.. ‘అదుర్స్’ (Adhurs) సీక్వెల్‌కు ఒప్పిస్తానని కోన వెంకట్ చెప్పుకొచ్చారు.
*Kona Venkat: తెలుగమ్మాయి 50 సినిమాలు చెయ్యడం గొప్ప విషయం
తాజాగా ఆయన నిర్మించిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindhi) చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కోన వెంకట్‌ని... ‘వెంకీ’ (Venky), ‘అదుర్స్’ (Adhurs) చిత్రాల సీక్వెల్స్ అంటూ ఈ మధ్య వార్తలు వినబడుతున్నాయి. వీటిపై మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారా? అని మీడియా అడిగింది. ఈ ప్రశ్నకు సమాధానంగా కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘‘సీక్వెల్స్ ఆలోచనలున్నాయి. అయితే ‘వెంకీ 2’ ఎప్పుడనేది చెప్పలేను కానీ.. ‘అదుర్స్’ సీక్వెల్ మాత్రం కచ్చితంగా ఉంటుంది. ‘అదుర్స్’ సీక్వెల్ కోసం తారక్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేసైనా సరే ఆయనని ఒప్పిస్తా. అంతేకాదు.. ఈ సీక్వెల్‌ని కూడా వినాయక్‌తోనే డైరెక్ట్ చేయిస్తా. చారి పాత్రకు తారక్‌ని తప్ప వేరొకరిని ఊహించుకోలేను. ఆయన తప్ప వేరొకరు ఆ పాత్రకు న్యాయం చేయలేరు. ‘అదుర్స్’ సినిమా తారక్ ది బెస్ట్ చిత్రాలలో ఒకటి. కచ్చితంగా ‘అదుర్స్’ సీక్వెల్ (Adhurs Sequel) అయితే ఉంటుంది.. కాకపోతే కాస్త టైమ్ పడుతుంది’’ అని చెప్పుకొచ్చారు.
తారక్ ‘అదుర్స్’ (Tarak Adhurs Movie) చిత్ర విషయానికి వస్తే.. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. కోన వెంకట్ కథ అందించిన ఈ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ (VV Vinayak) డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో చారిగా ఎన్టీఆర్ చేసిన కామెడీకి ప్రేక్షకులు పడి పడి నవ్వుకునేలా చిత్రీకరించారు. ఎన్టీఆర్‌లోని కామెడీ యాంగిల్‌ని పరిచయం చేసిన చిత్రంగా ‘అదుర్స్’ నిలిచిపోయింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ అంటే.. ప్రస్తుతం ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్, ఇమేజ్ దృష్ట్యా సాధ్యమయ్యే పని కాదని కొందరి అభిప్రాయం. అందుకే కోన వెంకట్ ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారు. (#Adhurs2)
ఇవి కూడా చదవండి:
====================
*Paiyaa: 14 యేళ్ల తర్వాత ‘పయ్యా’ రీ రిలీజ్
*******************************
*Vijay Deverakonda: అలా చెప్పడం తప్పు కాదు.. అలా చెప్పి కొట్టకపోవడం తప్పు
******************************
*Natti Kumar: వలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి వర్క్ చేయండి.. సజ్జలకు ఆ రైట్ లేదు
***********************