Heroines - Yoga : యోగా డే.. తారల విన్యాసాలు
ABN , Publish Date - Jun 21 , 2024 | 04:54 PM
బం చిక్ బం బం చెయ్యి యోగా.. ఒంటికి యోగా మంచిదేగా లేజీగా ఒళ్లు పెంచుకోక.. నాజూగ్గా ఉంచు తీగలాగా’ అంటున్నారు హీరోయిన్స్.
'బం చిక్ బం బం చెయ్యి యోగా..
ఒంటికి యోగా మంచిదేగా
లేజీగా ఒళ్లు పెంచుకోక.. నాజూగ్గా ఉంచు తీగలాగా’ అంటున్నారు హీరోయిన్స్.
వారికి డైలీ రొటీన్ లో యోగా ఓ భాగం. తారల దృష్టి ఎప్పుడు బాడీ ఫిట్‌నెస్ మీదే ఉంటుంది. అందుకే నిత్యం జిమ్‌లో కసరత్తులు చేస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా యోగా వారి జీవితంలో ఓ భాగంగా మారింది. నేటి తరం కథానాయికల ఫిట్‌నెస్‌కు యోగా ఓ కారణం. యోగా సెషన్‌కు సంబంధించిన ఫొటోలను అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగా డే’ (International Yoga Day) శుభాకాంక్షలు తెలియజేస్తూ.. వారి యోగా సెషన్ ఫొటోలను పంచుకుని అభిమానుల్లో స్ఫూర్తి నింపారు.
‘ఆరోగ్యం విషయంలోనే కాదు అన్నింటిలోనూ కలిసి పనిచేయడం బాగుంటుంది’’ అంటూ తన భర్త జాకీ భగ్నానీతో కలిసి యోగా చేస్తున్న ఫొటోలను షేర్ చేశారు రకుల్ ప్రీత సింగ్.
యోగా తన జీవితంలో మంచి మార్పులు తీసుకొచ్చిందని చెప్పారు మలైకా అరోరా. యోగా డే సందర్భంగా తారలు పంచుకున్న ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి..
ఆసనాలు వేస్తున్న ప్రగ్య జైస్వాల్