Harsha Sai: నోరు తెరిచిన హర్ష సాయి.. అంతా దాని కోసమే చేస్తుంది!

ABN , Publish Date - Sep 25 , 2024 | 12:39 PM

నిన్నటినుండి హర్షసాయి పేరు మారుమోగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఈ కేసు విష‌యంలో ఫ‌స్ట్ టైం హ‌ర్ష బ‌య‌ట‌కు వ‌చ్చి సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

harsha

హర్షసాయి (HARSHA SAI) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగ‌తి తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్ష మోసం చేశాడంటూ ఓ యువతి అడ్వకేట్‌తో కలిసి నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మరీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో హర్ష సాయి పారిపోయారు అంటూ అనేక వార్తలొచ్చాయి. నిజానికి ఫ్యామిలీతో సహా హర్ష సాయి కనిపించకుండా పోయిన విషయం వాస్తవమే. అయితే ఆయన సోషల్ మీడియా(SOCIAL MEDIA) మాధ్యమం ద్వారా ఈ వార్తలపై స్పందించారు.

హర్ష సాయి ప్రేమ,పెళ్లి పేరుతో తనపై అఘాయిత్యం చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటూ బాధితురాలు చేసిన ఫిర్యాదు పోలీసులు కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ఇది "మెగా"(MEGA) సినిమాకి సంబంధించిన కాపీ రైట్స్ విషయంలో జరిగిన తగదాగా తెలుస్తోంది. అయితే మీడియాలో ప్రచురితమ‌వుతున్న వరుస కథనాలపై హర్ష సాయి స్పందించారు.


తన ఇన్‌స్టాగ్రామ్ (INSTAGRAM) ఖాతా ద్వారా "నేను ఏంటో మీకు తెలుసు, నిజం తొందర్లోనే బయట పడుతుంది. ఇవన్నీ నిరాధార ఆరోపణలు, కేవలం డబ్బు కోసమే చేస్తున్నారు. ఇప్పటి నుంచి నా అడ్వకేట్ తాటికొండ చిరంజీవి విజయవాడ నుండి దీనిపై స్పందిస్తారు" అని స్టోరీలో రాసుకొచ్చారు.

sai.jpg

కాగా, మరోవైపు బాధితురాలు హర్షసాయి నుంచి ప్రాణహాని ఉందని పోలీసులతో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే హర్షసాయితో పాటు ఇతర కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచ్చాఫ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే బాధితురాలు నుండి పోలీసులు మరిన్ని సాక్ష్యాధారాలు కోరినట్లు సమాచారం.

Updated Date - Sep 25 , 2024 | 04:00 PM