Harish Shankar: మళ్లీ కెలుక్కుంటాను అంటే.. రా చూసుకుందాం.. కెమెరామెన్‌ చోటకు హరీష్ వార్నింగ్

ABN , Publish Date - Apr 20 , 2024 | 06:08 PM

సీనియర్ సినిమాటోగ్రాఫర్ చోట కె నాయుడుపై బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఫైర్ అయ్యారు. సందర్భం లేకున్నా.. తన ప్రస్తావన తెచ్చి, కించపరిచే విధంగా మాట్లాడితే ఇకపై ఊరుకునేది లేదని చెబుతూ.. ట్విట్టర్ వేదికగా ఆయన చోట కె నాయుడుకు వార్నింగ్ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్‌ని ప్రస్తావిస్తూ చోట కె నాయుడు చేసిన కామెంట్స్‌‌పై స్పందించిన హరీష్ శంకర్.. ట్విట్టర్ వేదికగా ఓ లేఖను విడుదల చేశారు.

Harish Shankar: మళ్లీ కెలుక్కుంటాను అంటే.. రా చూసుకుందాం.. కెమెరామెన్‌ చోటకు హరీష్ వార్నింగ్
Chota K Naidu and Harish Shankar

సీనియర్ సినిమాటోగ్రాఫర్ చోట కె నాయుడు (Chota K Naidu)పై బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) ఫైర్ అయ్యారు. సందర్భం లేకున్నా.. తన ప్రస్తావన తెచ్చి, కించపరిచే విధంగా మాట్లాడితే ఇకపై ఊరుకునేది లేదని చెబుతూ.. ట్విట్టర్ వేదికగా ఆయన చోట కె నాయుడుకు వార్నింగ్ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసే అతను అడగకపోయినా.. హరీష్ శంకర్ ప్రస్తావన తెచ్చిన చోట కె నాయుడు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘రామయ్య వస్తావయ్యా’ (Ramayya Vasthavayya) సినిమా టైమ్‌లో హరీష్ శంకర్ తన మాట వినలేదని, ఏదేదో చెప్పేవాడిని.. ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో.. కోపం వచ్చినా సరే.. ఒక్క నిమిషం పాటు ఆలోచించి.. తను చెప్పిందే చేశానని చెప్పుకొచ్చారు. ఆ వీడియో షేర్ చేసిన హరీష్ శంకర్.. ‘మీతో పని చేసిన అనుభవం నన్ను బాధపెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను.. అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి’ అంటూ ట్విట్టర్ వేదికగా ఓ వార్నింగ్ లెటర్‌ను విడుదల చేశారు. ఆ లెటర్‌లో ఏముందంటే.. (Harish Shankar Letter)

*Megastar Chiranjeevi: అప్పుడు ‘హనుమాన్’కి.. ఇప్పుడు ‘భజే వాయు వేగం’కి..!


Harish-Shankar.jpg

‘‘(వయసులో పెద్ద కాబట్టి)

గౌరవనీయులైన చోట కె నాయుడుగారికి నమస్కరిస్తూ..

రామయ్య వస్తావయ్యా సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది

ఈ పదేళ్లలో ఉదాహరణకి మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే, నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా

కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా నీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు

మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానంగా మాట్లాడారు (Harish Shankar Vs Chota K Naidu)

మీకు గుర్తుందో లేదో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్తో షూటింగ్ చేద్దాం అన్న ప్రస్తావన వచ్చింది

కానీ రాజుగారు చెప్పడం మూలంగానో గబ్బర్ సింగ్ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్‌ని తీసేస్తున్నాడు..

అని పదిమంది పది రకాలుగా మాట్లాడుకుంటారని మథనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా.

ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు ఎందుకంటే

‘గబ్బర్‌సింగ్’ వచ్చినప్పుడు నాది ‘రామయ్య వస్తావయ్య’ వస్తే అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది.

మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా,

నా ప్రస్తావన రాకున్నా,

నాకు సంబంధం లేకున్నా,

నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు.

ఇలా చాలాసార్లు జరిగినా, నేను మౌనంగానే బాధపడ్డా, కానీ నా స్నేహితులు అవ్వచ్చు లేదా నన్ను

అభిమానించే వాళ్లు అవ్వచ్చు నా ఆత్మ అభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తుంది.

మీతో పని చేసిన అనుభవం నన్ను బాధపెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను

అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి.

ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి.

కాదు కూడదు మళ్లీ కెలుక్కుంటాను అని అంటే..

any day

any platform

I AM WAITING

-భవదీయుడు హరీష్ శంకర్’’ అని హరీష్ శంకర్ పేర్కొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 06:08 PM