HanuMan: హనుమాన్.. ఈ వారం బంపర్ ఆఫర్! డోంట్ మిస్
ABN , Publish Date - Feb 23 , 2024 | 04:48 PM
సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి, థియేటర్లకు రప్పించడానికి మేకర్స్ ఎప్పుడూ ప్రత్యేక ఆఫర్లు, రాయితీలు ప్రకటిస్తుంటారు. ఈ క్రమంలోనే సినిమా లవర్స్ డే అంటూ దేశంలోనే అతిపెద్ద మల్లీప్టెక్స్ దిగ్గజం అయిన PVR, Inox ఇటీవల దేశవ్యాప్తంగా తమ మల్టీఫ్లెక్స్‌లలో ఓ ప్రత్యేకమైన ఆఫర్‌ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అంతకు మించి అనేలా హనుమాన్ బంపర్ ఆఫర్‌తో వచ్చాడు..
సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి, థియేటర్లకు రప్పించడానికి ఎప్పుడూ ప్రత్యేక ఆఫర్లు, రాయితీలను మేకర్స్ ప్రకటిస్తుంటారు. ఈ క్రమంలోనే సినిమా లవర్స్ డే (Cinema Lovers Day) అంటూ దేశంలోనే అతిపెద్ద మల్లీప్టెక్స్ దిగ్గజం అయిన PVR, Inox ఇటీవల దేశవ్యాప్తంగా తమ మల్టీఫ్లెక్స్‌లలో ఓ ప్రత్యేకమైన ఆఫర్‌ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ కింద 23.02.2024 శుక్రవారం రోజున PVR, Inox మల్టీఫ్లెక్స్‌లలో ఏ సినిమానైనా రూ. 99కే చూసే అవకాశం కల్పించింది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,కేరళ రాష్ట్రాలలో సినిమా ధర మాత్రం రూ.112గా ప్రకటించింది.
రెగ్యులర్‌గా అయితే తెలంగాణ మల్టీఫ్లెక్స్‌లలో టికెట్ ధర క్లాసిక్ రూ. 200, రిక్లైన్ రూ.300 ఉంటుండగా ఈ ఆఫర్ కింద టికెట్ ధరలను క్లాసిక్‌కు రూ.112, రిక్లైనర్‌కు రూ.250 గా నిర్ణయించారు. దీంతో ఈ అవకాశాన్ని దేశవ్యాప్తంగా సినీ ప్రియులు మంచిగా ఉపయోగించుకుంటుండగా మరో రెండు రోజులు ఈ ఆఫర్ కంటిన్యూ చేస్తే బావుంటుందని, వీకెండ్ కలిసి వచ్చేదంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే సదరు PVR, Inox మల్టీప్లెక్సుల యాజమాన్యం కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని, ఈరోజు విడుదలైన సినిమాలను కూడా ఈ ఆఫర్ రేట్లతో వీక్షించ వచ్చని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా గత సంక్రాంతికి థియేటర్లలో విడుదలై దేశవ్యాప్తంగా మంచి కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించిన చిత్రం ‘హనుమాన్’ (HanuMan) మాత్రం ఇప్పుడొక బంపర్ ఆఫర్‌తో వచ్చేశాడు. జనవరి 12 న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్ల వరకు వసూలు చేసింది. చిత్రం రిలీజై 40 రోజులు దాటినా ఇంకా థియేటర్లలో మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ క్రమంలో హనుమాన్ చిత్ర యూనిట్, మల్టీప్లెక్స్ యాజమాన్యంతో కలిసి ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని నేషనల్ మల్టీప్లెక్సులలో ఈ హనుమాన్ (HanuMan) సినిమాను రూ.112 కే చూడొచ్చని, ఈ ఆఫర్ ఫిబ్రవరి 23 నుంచి ఫిబ్రవరి 29 వరకు ఉంటుందని అధికారికంగా ప్రకటించింది.